GK Bits In Telugu 1 Year 2025

By Gk Bits Telugu

Updated On:

GK Bits In Telugu 1 Year 2025

Join WhatsApp

Join Now

GK Bits In Telugu 1 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.

GK Bits In Telugu 1 Year 2025 : ప్రశ్నలు

1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన మిత్ర’ వాట్స్ యాప్ నంబరు ?

(ఎ) 9552100009

(బి) 9552200009

(సి) 9552300009

(డి) 9552400009

2. “పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన” కింద ఎప్పటికి సుమారు 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ?

(ఎ) 2026 మార్చ్

(బి) 2027 మార్చ్

(సి) 2028 మార్చ్

(డి) 2029 మార్చ్

3. అమెరికా సరకులపై సుంకాలను ప్రస్తుత 84% నుంచి ఎంతకు పెంచుతున్నట్లు 2025 ఏప్రిల్ 11న చైనా ప్రకటించింది ?

(ఎ) 100%

(బి) 125%

(సి) 150%

(డి) 175%

4. 2026-27 నాటికి భారతదేశవ్యాప్తంగా ఎన్ని ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యం ?

(ఎ) కోటి

(బి) 2 కోట్లు

(సి) 3 కోట్లు

(డి) 4 కోట్లు

5. ఎవరికి యూజీసీ చైర్మన్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?

(ఎ) వినీత్ జోషి

(బి) మామిడాల జగదీశ్ కుమార్

(సి) ఎ.కె. బజాజ్

(డి) జస్టిస్ కాంతరాజ

6. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా ఏ సంవత్సరంలో ‘స్పుత్నిక్ 1’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ?

(ఎ) 1955

(బి) 1956

(సి) 1957

(డి) 1958

7. ‘అంతర్జాతీయ మానవసహిత అంతరిక్ష యాత్రా దినోత్సవం’ ను ఏ తేదీన నిర్వహిస్తున్నారు ?

(ఎ) ఏప్రిల్ 11

(బి) ఏప్రిల్ 12

(సి) ఏప్రిల్ 13

(డి) ఏప్రిల్ 14

8. ‘షినావ్రత’ ఏ దేశానికి ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు ?

(ఎ) ఇండోనేషియా

(బి) మలేషియా

(సి) సింగపూర్

(డి) థాయిలాండ్

9. ప్రపంచంలోనే మొదటిసారిగా త్రీడీ సాంకేతికతతో ఏ దేశంలో 6 గంటల్లోనే రైల్వేస్టేషన్ ను నిర్మించారు ?

(ఎ) అమెరికా

(బి) జపాన్

(సి) సింగపూర్

(డి) జర్మనీ

10. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘గౌరవ్’ అనేది ఒక ——- ?

(ఎ) స్వల్పశ్రేణి గ్లైడ్ బాంబు

(బి) మధ్యశ్రేణి గ్లైడ్ బాంబు

(సి) దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు

(డి) ఏదీ కాదు

GK Bits In Telugu 1 Year 2025 : సరియైన సమాధానాలు

(1) సి (2) బి (3) బి (4) ఎ (5) ఎ (6) సి (7) బి (8) డి (9) బి (10) సి

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

Leave a Comment