GK Bits In Telugu 3 Year 2025

By Gk Bits Telugu

Published On:

GK Bits In Telugu 3 Year 2025

Join WhatsApp

Join Now

GK Bits In Telugu 3 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.

GK Bits In Telugu 3 Year 2025 : ప్రశ్నలు

1. వివిధ యాప్ ల స్థానంలో ‘లీప్’ (LEAP = Learning Excellence in Andhra Pradesh) అనే సమగ్ర యాప్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీ నుండి అందుబాటులోకి తీసుకొచ్చింది ?

(ఎ) 2025 ఏప్రిల్ 15

(బి) 2025 ఏప్రిల్ 16

(సి) 2025 ఏప్రిల్ 17

(డి) 2025 ఏప్రిల్ 18

2. ‘ఇండియా జస్టిస్ డెలివరీ ఇండెక్స్’ లో ఈ ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4

3. ‘కొండమెట్లు’ పుస్తక రచయిత ?

(ఎ) ఎం. వెంకయ్యనాయుడు

(బి) జస్టిస్ ఎన్.వి. రమణ

(సి) హెచ్.జె. దొర

(డి) సి. రామచంద్రనాయుడు

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్-2025‘ (SC Sub-Classification Ordinance-2025) కి సంబంధించిన గెజిట్ (G.O. 19) నోటిఫికేషన్ ను ఏ తేదీన అధికారికంగా విడుదల చేశారు ?

(ఎ) 2025 ఏప్రిల్ 16

(బి) 2025 ఏప్రిల్ 17

(సి) 2025 ఏప్రిల్ 18

(డి) 2025 ఏప్రిల్ 19

5. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై ఎన్ని నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో తీర్పు చెప్పింది ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4

6. రాజ్యాంగంలోని ఏ అధికరణం సుప్రీంకోర్టుకు ప్లీనరీ (సంపూర్ణ) అధికారాలిచ్చింది ?

(ఎ) 141

(బి) 142

(సి) 143

(డి) 144

7. ప్రపంచ ఆర్ధిక వేదిక (World Economic Forum – WEF)  ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ (Young Global Leaders) లో ఒకరిగా ఎంపికైన “కింజరాపు రామ్మోహన్ నాయుడు” ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఏ శాఖను నిర్వహిస్తున్నారు ?

(ఎ) రక్షణ

(బి) ఆర్ధిక

(సి) పౌర విమానయాన

(డి) వ్యవసాయ

8. ఇటీవల ఏ నటుడికి వ్యతిరేకంగా ‘ఆల్ ఇండియా ముస్లిం జమాత్’ (AIMJ) అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేశారు ?

(ఎ) విజయ్ సేతుపతి

(బి) విజయ్ దళపతి

(సి) విజయ్ దేవరకొండ

(డి) సన్నీ డియోల్

9. భారతదేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3డీ స్వదేశీ సాంకేతికతతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని (Project Prabal) ఎక్కడ నిర్మించారు ?

(ఎ) సియాచిన్

(బి) లేహ్

(సి) జమ్మూ

(డి) డెహ్రాడూన్

10. పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు (Auto Mutation) జరిగే విధానాన్ని ఏ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది ?

(ఎ) విజయవాడ

(బి) విశాఖపట్నం

(సి) తిరుపతి

(డి) ఒంగోలు

GK Bits In Telugu 3 Year 2025 : సరియైన సమాధానాలు

(1) బి

వివరణ :

‘లీప్’ అనే యాప్ లో “స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్ బోర్డు” అనే 6 విభాగాలున్నాయి.

(2) బి

వివరణ :

2022వ సంవత్సరంలో ఈ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది.

(3) డి

వివరణ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఐజీ ‘సి. రామచంద్రనాయుడు’ ఆత్మకథ “కొండమెట్లు” పుస్తకావిష్కరణను హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని దసపల్లా హోటల్ లో 2025 ఏప్రిల్ 16న జరిగింది.

(4) బి

వివరణ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 2025 ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 30 సంవత్సరాలపాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కినట్లయ్యింది.

(5) సి

(6) బి

వివరణ :

సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా ఆదేశాలు ఇవ్వడానికి భారత రాజ్యాంగంలోని 142వ అధికరణం వీలు కల్పిస్తోంది. 247 అందుబాటులో ఉండే అనుక్షిపణి లాంటిది ఈ అధికరణం అని భారత ఉపరాష్ట్రపతి ‘జగదీప్ ధన్ ఖడ్’ వ్యాఖ్యానించారు.

(7) సి

వివరణ :

తమ తమ రంగాల్లో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్న 40 ఏళ్ల లోపు వారిని డబ్ల్యుఈఎఫ్ (WEF) ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ దఫా ప్రపంచ నలుమూలల నుంచి 116 మందిని ఎంపిక చేయగా, వారిలో కె. రామ్మోహన్ నాయుడు ఒకరు. వరుసగా 3వ సారి లోక్ సభకు ఎన్నికవడంతోపాటు 36 ఏళ్ల పిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

(8) బి

వివరణ :

తమిళ నటుడు, టీవీకే (TVK) పార్టీ అధినేత ‘విజయ్ దళపతి’ కి వ్యతిరేకంగా అధ్యక్షుడు ఫత్వా జారీ చేశారు. ‘విజయ్ తన సినిమాల్లో ముస్లింలను తీవ్రవాదాన్ని ప్రోత్సహించేవారిగా చూపించారు. తన ఇఫ్తార్ విందుకు జూదగాళ్లు, మద్యం తాగేవారిని ఆహ్వానించారు. ఈ కారణంగా సున్నీ ముస్లింలు విజయ్ పై ఫత్వా జారీ చేయాలని కోరారు. అందుకే ఫత్వా జారీ చేశా’ అని రజ్వీ పేర్కొన్నారు.

(9) బి

(10) ఎ

వివరణ :

వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని పట్టణాలు, నగరాల్లో ఆస్తుల కొనుగోళ్లకూ అమలుచేసే విషయమై కొద్దికాలం నుంచి కసరత్తు జరుగుతోంది.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

Leave a Comment