GK Bits In Telugu 6 Year 2025

By Gk Bits Telugu

Published On:

GK Bits In Telugu 6 Year 2025

Join WhatsApp

Join Now

GK Bits In Telugu 6 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.

GK Bits In Telugu 6 Year 2025 : ప్రశ్నలు

1. గృహ, వాణిజ్య సంస్థలు ఏసీ (AC) లను ఎన్ని డిగ్రీల వద్ద వినియోగించడం వలన విద్యుత్ వినియోగంలో 6% ఆదా అవుతుందని ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ‘ (BEE) తెలిపింది ?

(ఎ) 21

(బి) 22

(సి) 23

(డి) 24

2. ఇటీవల ‘ఐరన్ వుడ్’ (Ironwood) అనే కొత్త కంప్యూటర్ చిప్ ను ఆవిష్కరించిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ?

(ఎ) మైక్రోసాఫ్ట్

(బి) ఆపిల్

(సి) పేస్ బుక్

(డి) గూగుల్

3. జమ్మూకశ్మీర్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా పర్యాటకులపై నేరుగా అతిపెద్ద ఉగ్రదాడి ఏ తేదీన జరిగింది ?

(ఎ) 2025 ఏప్రిల్ 21

(బి) 2025 ఏప్రిల్ 22

(సి) 2025 ఏప్రిల్ 23

(డి) 2025 ఏప్రిల్ 24

4. 38 రోజులపాటు కొనసాగే ‘అమర్ నాథ్ యాత్ర’ ఈ సంవత్సరం ఏ తేదీన ప్రారంభం కానుంది ?

(ఎ) జులై 1

(బి) జులై 2

(సి) జులై 3

(డి) జులై 4

5. యూపీఎస్సీ 2025 ఏప్రిల్ 22న విడుదల చేసిన సివిల్స్-2024 తుది ఫలితాల్లో (Civil-2024 Final Results) తొలి స్థానంలో నిలిచినది ?

(ఎ) శక్తి దుబె

(బి) హర్షిత గోయల్

(సి) డోంగ్రే అర్చిత్ పరాగ్

(డి) షా మార్గి చిరాగ్

6. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని ఎక్కడ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ?

(ఎ) తిరుపతి

(బి) విశాఖపట్నం

(సి) కర్నూల్

(డి) అమరావతి

7. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక ‘లాస్ ఏంజెలిస్’ లో ఏ తేదీన జరగనున్నాయి ?

(ఎ) 2026 మార్చ్ 10

(బి) 2026 మార్చ్ 15

(సి) 2026 మార్చ్ 20

(డి) 2026 మార్చ్ 25

8. పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ?

(ఎ) సుధామూర్తి

(బి) హేమమాలిని

(సి) దగ్గుబాటి పురందేశ్వరి

(డి) కడియం కావ్య

9. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతిని పురస్కరించుకుని రూ. 100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాణెం యొక్క చుట్టుకొలత ఎంత ?

(ఎ) 41 మిల్లీమీటర్లు

(బి) 42 మిల్లీమీటర్లు

(సి) 43 మిల్లీమీటర్లు

(డి) 44 మిల్లీమీటర్లు

10. కశ్మీర్ లోని పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ?

(ఎ) 9818395784

(బి) 9818395785

(సి) 9818395786

(డి) 9818395787

GK Bits In Telugu 6 Year 2025 : సరియైన సమాధానాలు

(1) డి

వివరణ :

ఏసీ (AC) లను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వలన ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా రూ. 10,000 కోట్లు మిగిల్చినట్లు అవుతుందని BEE తెలిపింది. “సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీ లను వినియోగిస్తున్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీ లను వినియోగించేటప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది. ఏసీ ల జీవితకాలమూ పెరుగుతుంది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాం” అని BEE పేర్కొంది.

(2) డి

వివరణ :

‘ఐరన్ వుడ్’ (Ironwood) అనేది గూగుల్ కు చెందిన 7వ తరం టీపీయూ (TPU = Tensor Processing Unit). TPU అనేది ఒకరకమైన ‘అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మెషిన్ లెర్నింగ్ కు వాడే డేటా స్ట్రక్చర్లను ‘టెన్సర్స్’ అని అంటారు. వీటి పనులను నిర్వర్తించడానికి TPU లను రూపొందించారు. విస్తృతమైన డేటాను ఇవి మంచి నైపుణ్యంతో ప్రాసెస్ చేస్తాయి. సంక్లిష్ట న్యూరల్ నెట్ వర్క్స్ ను సమర్థంగా నిర్వహిస్తాయి. ఇలా ఏఐ మోడళ్ల (AI Models) కు చాలా త్వరగా శిక్షణ ఇస్తాయి. జీపీయూ (GPU = Graphics Processing Unit) లతో వారంలో ఇచ్చే శిక్షణను TPUలతో గంటల్లోనే పూర్తి చేయొచ్చు. తొలిసారి 2015లో గూగుల్ టీపీయూల వాడకాన్ని ఆరంభించింది.

సెర్చ్, యూట్యూబ్, డీప్ మైండ్ కు చెందిన లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు టీపీయూ అనేది గుండెకాయ లాంటిది.

(3) బి

వివరణ :

మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన 2025 ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటుచేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

(4) సి

వివరణ :

భారతదేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్ నాథ్ (Amarnath Tour) హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ నుంచి 48 కి.మీ. దూరం ఉండగా, మరొకటి గాందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కి.మీ. దూరం ఉంటుంది.

(5) ఎ

వివరణ :

ఉత్తర్ ప్రదేశ్ లోని నైనికి చెందిన ‘శక్తి దుబె’ తొలి స్థానంలో నిలిచారు. హరియాణాలో పుట్టి వడోదరలో పెరిగిన ‘హర్షిత గోయల్’ 2వ ర్యాంకు, మహారాష్ట్రలోని పూణే కు చెందిన ‘డోంగ్రే అర్చిత్ పరాగ్’ 3వ ర్యాంకు, గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ‘షా మార్గి చిరాగ్’ 4వ ర్యాంకు సాధించారు.

వరంగల్ కు చెందిన ‘సాయి శివాని’ 11వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంక్. ఆ తర్వాత ర్యాంకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ‘బన్నా వెంకటేశ్’ ది. ఆయన ఇప్పటికే సివిల్ సర్వీసెస్ లో ఉన్నా … మళ్లీ రాసి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.

(6) డి

(7) బి

వివరణ :

98వ ఆస్కార్ అవార్డుల (98th Oscar Awards) పురస్కారాలలో తాజాగా ‘అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్’ అనే విభాగాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది.

(8) సి

(9) డి

వివరణ :

44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటాయి. 2026 నవంబర్ 23 నాటికి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు పూర్తికానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నాణెం 35 గ్రాములు బరువుంటుంది. దీనిపై ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, దానికింద 1926 నంబర్ ఉంటుంది.

(10) డి

వివరణ :

పహల్గాం ఉగ్రదాడి బాధితుల కోసం  Cell Number 9818395787, Landline Number 01123387089 లను Helpline Numbers గా దిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేశారు.

*************

క్రితం GK Bits In Telugu కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తర్వాతి GK Bits In Telugu కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

Leave a Comment