ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 25% ఉచిత ప్రవేశాలకు (25% Free Seats In AP Private Schools) ప్రకటన విడుదల అయ్యింది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు 2025 ఏప్రిల్ 28 నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
25% Free Seats In AP Private Schools For The Year 2025-26 : Toll Free Number
ఈ ప్రవేశాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 18004258599 అనే టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదించవలెను.
25% Free Seats In AP Private Schools For The Year 2025-26 : Documents
ప్రస్తుత చిరునామా (Address Proof) కోసం ఈక్రింది పత్రాలలో తల్లిదండ్రులకు సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
- ఆధార్ కార్డు
- ఓటర్ కార్డు
- రేషన్ కార్డు
- భూమి హక్కుల పత్రం
- ఉపాధి హామీ జాబ్ కార్డు
- పాస్ పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- విద్యుత్ బిల్లు
- అద్దె ఒప్పంద పత్రం
పిల్లల వయసు ధ్రువీకరణ (Age Proof)
పిల్లల వయసు ధ్రువీకరణ కొరకు ‘జనన ధ్రువీకరణ పత్రం’ (Date of Birth Certificate) ను సమర్పించాలి.
CBSE, IB, ICSE బడుల్లో ప్రవేశాలకు 2025 మార్చ్ 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ పాఠశాలల్లో జూన్ 1వ తేదీ నాటికి ఐదేళ్లు పూర్తయి ఉండాలి.
25% Free Seats In AP Private Schools For The Year 2025-26 : అర్హతలు & ప్రవేశాలు
గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా మే 16 నుంచి 20 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు.
లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుండి 24వ తేదీల మధ్య విడుదల చేస్తారు.
సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2న చేస్తారు.
రెండో విడత ఫలితాలను జూన్ 6న విడుదల చేస్తారు.