GK Bits In Telugu 11 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 11 Year 2025 : ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులైన ‘ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్’, ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్’, ‘సప్తగిరి గ్రామీణ బ్యాంక్’, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్’ లను విలీనం చేసి “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్” గా ఏ తేదీ నుండి ఏర్పాటు చేయడమైనది ?
(ఎ) 2025 మే 1
(బి) 2025 మే 2
(సి) 2025 మే 3
(డి) 2025 మే 4
2. ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’ యొక్క ప్రాయోజిత బ్యాంక్ పేరు ?
(ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(బి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(సి) కెనరా బ్యాంక్
(డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3. ‘జాతీయ భద్రత సలహా బోర్డు’ చైర్మన్ గా ఎవరిని నియమించారు ?
(ఎ) పి.ఎం. సిన్హా
(బి) ఎ.కె. సింగ్
(సి) రాజీవ్ రంజన్
(డి) ఆలోక్ జోషి
4. భారతదేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘చార్ ధామ్’ యాత్ర ఈ సంవత్సరం ఏ తేదీన ప్రారంభమైంది ?
(ఎ) ఏప్రిల్ 28
(బి) ఏప్రిల్ 29
(సి) ఏప్రిల్ 30
(డి) మే 1
5. బ్రిటిష్ ఇండియాలో ఏయే సంవత్సరాల మధ్య కులాల వారీ జనాభా గణన జరిగింది ?
(ఎ) 1861 నుంచి 1911 వరకు
(బి) 1871 నుంచి 1921 వరకు
(సి) 1881 నుంచి 1931 వరకు
(డి) 1891 నుంచి 1941 వరకు
6. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో చేపట్టారు ?
(ఎ) 1951
(బి) 1952
(సి) 1953
(డి) 1954
7. ఏ సంవత్సరంలో చేపట్టిన జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల లెక్కలను తేల్చవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది ?
(ఎ) 1951
(బి) 1961
(సి) 1971
(డి) 1981
8. కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం ?
(ఎ) బిహార్
(బి) ఆంధ్రప్రదేశ్
(సి) తెలంగాణ
(డి) కర్ణాటక
9. సగరుల ఆరాధ్య దైవం ‘భగీరథ’ మహర్షి జయంతిని ఏ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) మే 1
(బి) మే 2
(సి) మే 3
(డి) మే 4
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశుపోషకులకు ఎంత రాయితీపై సమీకృత దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) 25%
(బి) 50%
(సి) 75%
(డి) 100%
GK Bits In Telugu 11 Year 2025 : సరియైన సమాధానాలు
(1) ఎ
వివరణ :
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేసేదిశగా గెజిట్ నోటిఫికేషన్ నంబర్ CG-DL-E-07042025-262329 ది. 07-04-2025 ప్రకారం జారీచేయబడిన భారత ప్రభుత్వ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకులను (Andhra Pragati Grameena Bank, Andhra Pradesh Grameena Vikas Bank, Saptagiri Grameena Bank, Chaitanya Godavari Grameena Bank) విలీనం చేసి ది. 01-05-2025 నుండి Andhra Pradesh Grameena Bank గా ఏర్పాటు చేయడమైనది.
(2) బి
(3) డి
వివరణ :
జాతీయ భద్రత సలహా బోర్డు (NSAB) చైర్మన్ గా భారత నిఘా విభాగం ‘రా’ మాజీ అధిపతి ‘ఆలోక్ జోషి’ ని నియమించారు. జాతీయ భద్రత మండలి సచివాలయానికి సలహా బోర్డుగా … 15 మంది సభ్యులతో కూడిన NSAB పని చేస్తుంది.
(4) సి
(5) సి
(6) ఎ
(7) బి
(8) ఎ
వివరణ :
తొలిసారిగా బిహార్ .. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కులగణన (kulaganana) ను నిర్వహించాయి. దీనిద్వారా రాష్ట్రస్థాయిలో అమలు చేసే సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ విధానాలను నిర్ణయించుకోవచ్చని ఆయా రాష్ట్రాలు భావించాయి.
2023లో బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఓబీసీలు, ఈబీసీలు 63% ఉన్నట్లు తేలింది. 2024లో ఆంధ్రప్రదేశ్ కుల గణన ను చేపట్టింది. 2024 నవంబర్ లో తెలంగాణాలో కుల గణన జరిగింది. 2021లో కుల గణన చేపట్టాలని ఝార్ఖండ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒడిశా, మహారాష్ట్రల్లోనూ కుల గణనపై తీర్మానాలు జరిగాయి.
(9) డి
(10) బి
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశుపోషకులకు సమీకృత దాణాను కిలో రూ. 22.11 కు కొని రైతు సేవా కేంద్రాలు, పశు వైద్యశాలల ద్వారా రూ. 11.10 కే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20% ప్రోటీన్ కలిగిన ఈ దాణాను తొలిసారి అందిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పశుపోషకులు ఈ లబ్ది పొందేందుకు అర్హులు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకు గానూ విడతల వారీగా 450 కిలోల దాణాను రాయితీపై పంపిణీ చేస్తారు.