GK Bits In Telugu 12 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 12 Year 2025 : ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మండలి నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
(ఎ) డాక్టర్ కె.వి. సుబ్బానాయుడు
(బి) ప్రొఫెసర్ గోగినేని సుజాత
(సి) డాక్టర్ స్వర్ణ గీత
(డి) డాక్టర్ రవ్వ శ్రీహరిరావు
2. ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ (World Laughter Day) ను ఎప్పుడు జరుపుతారు ?
(ఎ) మే నెల మొదటి ఆదివారం
(బి) మే నెల రెండవ ఆదివారం
(సి) మే నెల మూడవ ఆదివారం
(డి) మే నెల నాలుగవ ఆదివారం
3. ‘అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య’ (AIFF) నుంచి ఉత్తమ మహిళా ప్లేయర్ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి తెలుగు క్రీడాకారిణి ?
(ఎ) బాస స్రవంతి
(బి) బత్తుల మానస
(సి) సౌమ్య గుగులోత్
(డి) నందిని గుప్తా
4. ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్ 2025 ప్రకారం వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో నిలిచిన క్రికెట్ జట్టు ?
(ఎ) ఆస్ట్రేలియా
(బి) ఇంగ్లాండ్
(సి) దక్షిణాఫ్రికా
(డి) భారత్
5. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు ఎంత మొత్తం వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ 2025 మే 5న నోటిఫికేషన్ జారీ చేసింది ?
(ఎ) రూ. 1,00,000
(బి) రూ. 1,50,000
(సి) రూ. 2,00,000
(డి) రూ. 2,50,000
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా మెప్మా ఆధ్వర్యంలో ఏ నగరంలో ‘తృప్తి క్యాంటీన్’ ను ప్రయోగాత్మకంగా మంత్రి నారాయణ 2025 మే 5న ప్రారంభించారు ?
(ఎ) నెల్లూరు
(బి) ఒంగోలు
(సి) గుంతకల్లు
(డి) తిరుపతి
7. ఏ తేదీని ‘ఇంటర్నేషనల్ నో డైట్ డే’ గా పాటిస్తారు ?
(ఎ) మే 5
(బి) మే 6
(సి) మే 7
(డి) మే 8
8. ‘వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్’ గా చరిత్ర సృష్టించిన ఎథెల్ కేటర్ హామ్ ఏ దేశస్థురాలు ?
(ఎ) జపాన్
(బి) అమెరికా
(సి) న్యూజిలాండ్
(డి) ఇంగ్లాండ్
9. ‘ప్రపంచ ఆస్థమా దినం’ ను ఏ రోజున జరుపుతారు ?
(ఎ) మే నెల మొదటి మంగళవారం
(బి) మే నెల రెండవ మంగళవారం
(సి) మే నెల మూడవ మంగళవారం
(డి) మే నెల నాల్గవ మంగళవారం
10. ‘తయారీ’ రంగంలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న దేశం ?
(ఎ) అమెరికా
(బి) జపాన్
(సి) చైనా
(డి) జర్మనీ
GK Bits In Telugu 12 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
(2) ఎ
(3) సి
వివరణ :
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కూనేపల్లి కిషన్ తండా కు చెందిన 23 ఏళ్ల ‘సౌమ్య గుగులోత్’ AIFF నుంచి ఉత్తమ మహిళా ప్లేయర్ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
(4) డి
వివరణ :
2024 మే నెల నుంచి జరిగిన మ్యాచ్ ల ఫలితాలకు 100% పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ … అంతకుముందు రెండేళ్ల మ్యాచ్ లకు సంబంధించి 50% రేటింగ్ పాయింట్లు కేటాయించింది.
వన్డేల్లో భారత్ 124 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో సమానంగా 109 పాయింట్లే సాధించినప్పటికీ దశాంశాల తేడాతో న్యూజిలాండ్ 2వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలిచింది.
టీ20ల్లో భారత్ 271 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా .. ఆస్ట్రేలియా (262), ఇంగ్లాండ్ (254) వరుసగా 2, 3 స్థానాలు సాధించాయి.
టెస్టుల్లో ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ (113), దక్షిణాఫ్రికా (111), భారత్ (105) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
(5) బి
వివరణ :
ఈ నోటిఫికేషన్ 2025 మే 5 నుంచి అమలులోకి వచ్చింది. దీనికి Cashless Treatment of Road Accident Victims Scheme-2025 గా నామకరణం చేశారు. మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద ఆసుపత్రుల్లో రూ. 1,50,000 వరకూ నగదు రహిత వైద్యసేవలు పొందడానికి అర్హులవుతారు. ప్రమాదం జరిగిన నాటి నుండి 7 రోజుల వరకూ ఈ సేవలు పొందవచ్చు.
(6) ఎ
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,000 మంది మెప్మా మహిళలతో 700 క్యాంటీన్ (Trupti Canteen) లను అందుబాటులోకి తేనున్నారు.
(7) బి
వివరణ :
యూకే కి చెందిన ‘మేరీ ఎవాన్స్ యంగ్’ బ్రిటిష్ యాంటీ డైట్ ఆర్గనైజేషన్ Diet Breakers లో డైరెక్టర్ గా పనిచేసేవారు. 1992లో కొంతమంది మహిళలను కూడగట్టి లండన్ లోని హైడ్ పార్క్ లో పిక్నిక్ ఏర్పాటు చేసి ‘డిచ్ దట్ డైట్’ అంటూ ‘నో డైట్ డే’ కి నాంది పలికారు. ‘ఎవరి రూపురేఖల్ని వాళ్లు అంగీకరించడం, అనారోగ్యకరమైన డైట్ లకు స్వస్తి పలకడం’ అనేది ఆమె ఉద్దేశ్యం. అలా ఆనాడు ప్రారంభం అయిన ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రస్తుతం International No Diet Day గా కొనసాగుతోంది.
(8) డి
వివరణ :
‘ఎథెల్ కేటర్ హామ్’ 1909వ సంవత్సరం ఆగష్టు 21వ తేదీన ఇంగ్లాండ్ లోని ఓ పల్లెటూరిలో జన్మించారు. ప్రస్తుతం ఈమె ఓ కేర్ హోమ్ లో ఉంటున్నారు.
(9) ఎ
వివరణ :
‘ఇన్ హేలర్ చికిత్సలను అందరికీ అందుబాటులోకి తేవాలి’ అని ప్రపంచ ఆస్థమా దినం (World Asthma Day) నినదిస్తోంది.
(10) సి