GK Bits In Telugu 13 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 13 Year 2025 : ప్రశ్నలు
1. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఏ తేదీ నుంచి నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి ‘కె. రామ్మోహన్ నాయుడు’ 2025 మే 5న ప్రకటించారు ?
(ఎ) జూన్ 1
(బి) జులై 1
(సి) ఆగష్టు 1
(డి) సెప్టెంబర్ 1
2. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి, పరీక్షా కేంద్రాన్ని 2025 మే 11న దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించినది ?
(ఎ) నరేంద్ర మోదీ
(బి) అమిత్ షా
(సి) రాజ్ నాథ్ సింగ్
(డి) ద్రౌపది ముర్ము
3. భారతదేశానికి చెందిన ‘రాజీవ్ ఘాయ్’ యొక్క ప్రస్తుత హోదా ?
(ఎ) త్రిదళాధిపతి
(బి) డీజీఎంవో
(సి) ఎయిర్ మార్షల్
(డి) వైస్ అడ్మిరల్
4. భారతదేశంలో వివాహం అయిన జనాభాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కేరళ
(డి) బీహార్
5. భారతదేశంలో వితంతు/విడాకులు తీసుకున్న/విడిగా ఉంటున్నవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని క్రీడలను రెండు క్యాటగిరీలుగా విభజించారు ?
(ఎ) 50
(బి) 55
(సి) 60
(డి) 65
7. ‘నీరా’ అనేది ఏ రాష్ట్ర సంప్రదాయ పానీయం ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) కేరళ
8. భారతదేశానికి చెందిన ‘యుక్తాముఖి’ ఎన్నో మిస్ వరల్డ్ విజేతగా నిలిచారు ?
(ఎ) 47
(బి) 48
(సి) 49
(డి) 50
9. ‘మాడెలిన్ హార్టోగ్ – బెల్’ అనే వ్యక్తి ఏ దేశం తరపున 1967లో మొదటి మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది ?
(ఎ) పెరూ
(బి) కెన్యా
(సి) నైజీరియా
(డి) నమీబియా
10. భారతదేశంలో జనాభా లెక్కింపులో పాల్గొనే గణన అధికారులు ప్రజల నుంచి కుల వివరాలను పొందేందుకు 1948 నాటి ‘జనాభా లెక్కింపు చట్టం’ వీలు కల్పిస్తుంది. ఈ చట్టానికి చివరిగా ఏ సంవత్సరంలో సవరణ జరిగింది ?
(ఎ) 1991
(బి) 1992
(సి) 1993
(డి) 1994
GK Bits In Telugu 13 Year 2025 : సరియైన సమాధానాలు
(1) ఎ
వివరణ :
ఈ విమాన సర్వీసు ఉదయం 7:15 కు విజయవాడలో బయలుదేరి విశాఖపట్నం ఉదయం 8:25 కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 8:45 కు బయలుదేరి విజయవాడకు 9:45 కు చేరుకుంటుంది. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నిర్వహిస్తుంది.
(2) సి
(3) బి
వివరణ :
DGMO = Director General of Military Operations
(4) ఎ
వివరణ :
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన Sample Registration System Report ప్రకారం పెళ్లయినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానం (51.7%) లో ఉండగా … బీహార్ రాష్ట్రం (39.4%) చివరి స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ పురుషులు వివాహాల్లోనే కాకుండా, వితంతు/విడాకులు తీసుకున్న/విడిగా ఉంటున్న వారి విభాగంలోనూ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నారు.
వివాహం అయిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ (55.3%) మొదటి స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ (54.4%) రెండవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (54.2%) మూడవ స్థానంలో నిలిచాయి.
జాతీయ స్థాయిలో పెళ్లి కానివారు 51.2%, పెళ్లయినవారు 45.5%, వితంతు/విడాకులు/విడిగా ఉంటున్నవారు 3.3% మంది ఉన్నారు.
(5) సి
(6) డి
(7) బి
(8) సి
వివరణ :
1999 డిసెంబర్ 4న లండన్ లోని ఒలింపియా వేదికపై జరిగిన 49వ మిస్ వరల్డ్ పోటీల్లో 94 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మన దేశానికి చెందిన ‘యుక్తాముఖి’ విజేతగా నిలిచారు.
2000వ సంవత్సరంలో Miss World కిరీటం ‘ప్రియాంక చోప్రా’ కు దక్కింది. ఇలా రెండు వరుస సంవత్సరాలలో ఒకే దేశానికి చెందిన ఇద్దరికి ఈ కిరీటం దక్కడం మిస్ వరల్డ్ చరిత్రలో ఇదే తొలిసారి.
(9) ఎ
వివరణ :
1967వ సంవత్సరం తర్వాత ‘పెరూ’ దేశానికి మళ్లీ 2004లో Miss World Title దక్కింది. అంటే 37 సంవత్సరాల తర్వాత ఆ దేశం తరపున ‘మరియా జూలియా మాంటిల్లా గార్సియా’ అనే వ్యక్తి ఈ టైటిల్ ను సాధించింది. రెండు మిస్ వరల్డ్ విజయాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న దేశం ‘పెరూ’ నే.
(10) డి