GK Bits In Telugu 15 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 15 Year 2025 : ప్రశ్నలు
1. భారత్ తరపున ఓ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ మన్ ?
(ఎ) వీరేంద్ర సెహ్వాగ్
(బి) మన్సూర్ అలీఖాన్ పటౌడీ
(సి) సునీల్ గవాస్కర్
(డి) సచిన్ టెండూల్కర్
2. ఓ టెస్ట్ మ్యాచ్ లో (రెండు ఇన్నింగ్స్ లు కలిపి) భారత్ ఏ దేశంపై అత్యధిక పరుగులు (1014) సాధించింది ?
(ఎ) ఇంగ్లాండ్
(బి) ఆస్ట్రేలియా
(సి) వెస్ట్ ఇండీస్
(డి) పాకిస్థాన్
3. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో సెంచరీ కొట్టిన బ్యాటర్ ?
(ఎ) కమ్రాన్ గులామ్
(బి) విహాన్ మల్హోత్రా
(సి) నజ్ముల్ శాంటో
(డి) వైభవ్ సూర్యవంశీ
4. అమెరికాలో ట్రిలియన్లకొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతోపాటు 1.2 ట్రిలియన్ డాలర్ల విలువైన మెడిక్ ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (Big Beautiful Bill-USA) ఏ తేదీ నుంచి చట్టంగా మారింది ?
(ఎ) 2025 జులై 1
(బి) 2025 జులై 2
(సి) 2025 జులై 3
(డి) 2025 జులై 4
5. ట్రినిడాడ్-టొబాగో జనాభాలో దాదాపు 40% మంది వరకు భారత సంతతి వారు ఉన్నారు. వారిలో ఎన్నో తరంవారి వరకు ‘దేశాంతర భారత పౌరసత్వం’ (Overseas Citizenship of India – OCI) కార్డులు జారీ చేస్తామని భారత ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ప్రకటించారు ?
(ఎ) 2
(బి) 4
(సి) 6
(డి) 8
6. ట్రినిడాడ్-టొబాగో దేశానికి ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక కుర్చీని పంపించింది ?
(ఎ) 1967
(బి) 1968
(సి) 1969
(డి) 1970
7. ట్రినిడాడ్-టొబాగో దేశ పర్యటన తర్వాత అర్జెంటీనా కు చేరుకున్న భారత ప్రధాని ‘నరేంద్ర మోదీ’ కి ఆ దేశ అధ్యక్షుడు ‘జేవియర్ మిలీ’ స్వాగతం పలికి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఎన్ని సంవత్సరాల తర్వాత భారత ప్రధాని అర్జెంటీనా దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి ?
(ఎ) 56
(బి) 57
(సి) 58
(డి) 59
8. ‘ప్రపంచ బిర్యానీ దినోత్సవం’ (World Biryani Day) ను ఏ తేదీన జరుపుతారు ?
(ఎ) జులై 6
(బి) జులై 7
(సి) జులై 8
(డి) జులై 9
9. ఐకార్ (ICAR) గుర్తింపు ఉన్న ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్’ (ICAR-NBFGR) ఇన్స్టిట్యూట్ శాశ్వత కార్యాలయం ఎక్కడ ఉంది ?
(ఎ) కోల్ కతా
(బి) లఖ్ నవూ
(సి) ముంబయి
(డి) విశాఖపట్నం
10. ‘జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు’ (NFDB) ను ఏ సంవత్సరంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ?
(ఎ) 2006
(బి) 2007
(సి) 2008
(డి) 2009
GK Bits In Telugu 15 Year 2025 : సరియైన సమాధానాలు
(1) సి
వివరణ :
భారత్ తరపున ఓ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా ‘సునీల్ గవాస్కర్’ రికార్డు సృష్టించాడు. ఇతని తర్వాత ‘శుభ్ మన్ గిల్’ (2025 జులైలో ఇంగ్లాండ్ పై) ఆ రికార్డు సాధించాడు.
(2) ఎ
(3) డి
వివరణ :
బిహార్ రాష్ట్రానికి చెందిన ‘వైభవ్ సూర్యవంశీ’ అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో సెంచరీ కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. 2025 జులై 5న భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో వైభవ్ 78 బంతుల్లో 143 (134, 106) పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. యూత్ వన్డేల్లో పాకిస్థాన్ బ్యాటర్ ‘కమ్రాన్ గులామ్’ (53 బంతుల్లో, 2013లో) దే ఇప్పటిదాకా వేగవంతమైన సెంచరీ. అండర్-19 క్రికెట్ లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా బంగ్లాదేశ్ బ్యాటర్ ‘నజ్ముల్ శాంటో’ (14 ఏళ్ల 241 రోజులు) పేరిట ఉన్న రికార్డును కూడా వైభవ్ ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టాడు. 2025 జులై 5 నాటికి వైభవ్ వయసు 14 ఏళ్ల 100 రోజులు మాత్రమే.
ఐపీల్ లో, టీ20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ ఇంతకుముందే రికార్డు నెలకొల్పాడు.
(4) డి
వివరణ :
అమెరికా అధ్యక్షుడు ‘డోనాల్డ్ ట్రంప్’ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ 2025 జులై 4 (అమెరికా స్వాతంత్య్రం పొందిన రోజు) నుంచి చట్టంగా మారింది. అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనాల ప్రకారం .. పదేళ్లలో 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును ఈ బిల్లు తీర్చనుంది. అదే సమయంలో 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరమవుతారు.
(5) సి
వివరణ :
5 దేశాల పర్యటనలో భాగంగా 2025 జులై 4న ట్రినిడాడ్-టొబాగో దేశానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని ‘కమ్లా పర్సాద్ బిసెసర్’ తో చర్చలు జరిపారు. ఆ దేశ అధ్యక్షురాలు ‘క్రిస్టీన్ కర్లా కంగాలు’ తో కూడా మోదీ సమావేశమయ్యారు.
(6) బి
(7) బి
(8) ఎ
వివరణ :
బిర్యానీ అనే పేరు పర్షియా భాషలోని ‘బిరింజ్’ (Birinj) నుంచి వచ్చిందని అంటారు. బిర్యానీని దమ్ చేసే పద్దతిని మొదట మొఘలులు పరిచయం చేశారు. కుంకుమ పువ్వు, యోగర్ట్ లను మొదట వాడింది కూడా మొఘలులే. కుంకుమ పువ్వు బిర్యానీకి మంచి రంగు, సువాసనలను అందిస్తే … యోగర్ట్ మాంసాన్ని మృదువుగా చేస్తుంది.
(9) బి
(10) ఎ