GK Bits In Telugu 16 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 16 Year 2025 : ప్రశ్నలు
1. రైలు బయల్దేరడానికి 8 గంటల ముందుగానే రిజర్వేషన్ చార్టును తయారుచేసే విధానం దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ?
(ఎ) 2025 జులై 6
(బి) 2025 జులై 7
(సి) 2025 జులై 8
(డి) 2025 జులై 9
2. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా అణచివేసే విషయంలో ‘క్రిమినల్ లా’ ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఏ తేదీన “ఇమ్రాన్ ప్రతాప్ గాధి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్” కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ?
(ఎ) 2025 మార్చ్ 26
(బి) 2025 మార్చ్ 27
(సి) 2025 మార్చ్ 28
(డి) 2025 మార్చ్ 29
3. ‘భూదర్శిని’ (Bhudarsini) పేరుతో భారతదేశంలోనే తొలిసారిగా వెబ్ ల్యాండ్ ను తీర్చిదిద్దుతున్న రాష్ట్రం ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర
4. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు రూ. 206 కోట్ల విరాళాన్ని అందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ?
(ఎ) అజీమ్ ప్రేమ్ జీ
(బి) ముకేశ్ అంబానీ
(సి) శివ్ నాడార్
(డి) నారాయణమూర్తి
5. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ ను ప్రారంభించింది ?
(ఎ) 2021
(బి) 2022
(సి) 2023
(డి) 2024
6. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే స్వచ్చంద సంస్థ అందించిన సేవలకు గుర్తింపుగా ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది ?
(ఎ) 1996
(బి) 1997
(సి) 1998
(డి) 1999
7. ఏ కాలంలో జన్మించిన వారిని ‘జనరేషన్ జడ్’ (Generation Z) గా పిలుస్తారు ?
(ఎ) 1997-2012
(బి) 2013-2020
(సి) 1990-1996
(డి) 1980-1989
8. విశాఖపట్నం సమీపంలోని పరవాడలో ‘సింహాద్రి ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం’ ఏ తేదీన ఆవిర్భవించింది ?
(ఎ) 1997 జులై 6
(బి) 1997 జులై 7
(సి) 1997 జులై 8
(డి) 1997 జులై 9
9. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహకారం అందించేందుకు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ నౌక ?
(ఎ) ఐ ఎన్ ఎస్ తమాల్
(బి) ఐ ఎన్ ఎస్ నిస్తార్
(సి) ఐ ఎన్ ఎస్ తుషీల్
(డి) ఐ ఎన్ ఎస్ నీలగిరి
10. బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు 2025 జులై 7న ఏ నగరంలో జరిగింది ?
(ఎ) దిల్లీ
(బి) రియో డి జనీరో
(సి) షాంఘై
(డి) జొహన్నెస్ బర్గ్
GK Bits In Telugu 16 Year 2025 : సరియైన సమాధానాలు
(1) బి
వివరణ :
ఇప్పటివరకు 4 గంటల ముందుగా మాత్రమే రిజర్వేషన్ స్టేటస్ గురించి వెల్లడించేవారు. నూతన విధానంతో వెయిటింగ్ లిస్ట్ లోని ప్రయాణీకులు తమకు బెర్తులు ఖరారయ్యాయా ? లేదా ? అని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయలుదేరే రైళ్ల చార్టులను ముందు రోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్తు దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి భారత ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
(2) సి
వివరణ :
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు/వ్యాఖ్యలు చేసిన వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు “అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్” కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లను హైకోర్టు ఆదేశించింది.
(3) ఎ
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్ ల్యాండ్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతోపాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు … ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్ చేయగానే భూవిస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్ ల్యాండ్ ను తీర్చిదిద్దుతున్నారు. ‘భూదర్శిని’ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తోంది.
(4) సి
వివరణ :
శివ్ నాడార్ సొంతూరు తిరుచ్చెందూర్ సమీపం ‘మూలైపొలి’ గ్రామం.
(5) సి
వివరణ :
దేశీయంగా హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచి పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు, ఈ ఇంధన రంగంలో ఇండియాను ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతిదారుగా నిలిపేందుకు 2023వ సంవత్సరంలో భారత ప్రభుత్వం National Green Hydrogen Mission ను ప్రారంభించింది. సౌర, పవన విద్యుత్ సాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన ఇంధనమే ‘గ్రీన్ హైడ్రోజన్’. ఈ ప్రక్రియలో ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు.
మీథేన్ ను మండించడం ద్వారా తయారయ్యేది ‘గ్రే హైడ్రోజన్’. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇదే విధానంలో ఇంధనాన్ని తయారుచేసి కర్బన ఉద్గారాలను భూమిలో నిల్వ చేస్తే దాన్ని ‘బ్లూ హైడ్రోజన్’ అంటారు. దీనివల్లా పర్యావరణానికి కొంత హాని తప్పదు. అందుకే ప్రపంచ దేశాలు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ప్రాధాన్యమిస్తున్నాయి. వాయు రూపంలో ఉండే గ్రీన్ హైడ్రోజన్ ను నిల్వ చేయడం, తరలించడం చాలా సులభం. కాబట్టి ఇది పరిశ్రమలు, రవాణా సాధనాలకు బాగా ఉపయోగపడుతుంది.
(6) డి
వివరణ :
Doctors Without Borders అనే స్వచ్చంద సంస్థ 1971లో ఫ్రాన్స్ లో రూపుదిద్దుకుంది. యుద్ధాలు, కరవు కాటకాల వల్ల సతమతమవుతున్న పేద దేశాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించే ఉద్దేశంతో డాక్టర్లు, జర్నలిస్టులు కలిసి ఈ వినూత్నమైన సంస్థను ఏర్పాటు చేశారు. 300 మంది సభ్యులతో మొదలై, క్రమేణా పెరుగుతూ ఇప్పుడు 69,000 కి చేరింది. వీరిలో 169 దేశాలవారు ఉన్నారు.
డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థకు భారతదేశం 1996లో ‘ఇందిరాగాంధీ శాంతి బహుమతి’ ని ఇచ్చింది.
(7) ఎ
వివరణ :
2012 తర్వాత జన్మించిన వారిని ‘జనరేషన్ ఆల్ఫా’ (Generation Alpha) గా పిలుస్తారు.
(8) సి
(9) బి
వివరణ :
‘ఐ ఎన్ ఎస్ నిస్తార్’ భారత నేవీ లోకి 2025 జులై 8న ప్రవేశించింది.
(10) బి
వివరణ :
బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025కి హాజరైన భారత ప్రధాని ‘నరేంద్ర మోదీ’ BRICS కు Building Resilience and Innovation for Cooperation and Sustainability అనే కొత్త నిర్వచనం ఇచ్చారు. వచ్చే ఏడాది బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ‘భారత్’ మానవతా విధానాలకు ప్రాధాన్యమిస్తుందని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.