GK Bits In Telugu 17 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 17 Year 2025 : ప్రశ్నలు
1. క్రికెట్ క్రీడకు సంబంధించి విదేశీ గడ్డపై అత్యధిక స్కోర్ సాధించిన భారత తొలి సారథి ?
(ఎ) రోహిత్ శర్మ
(బి) విరాట్ కోహ్లి
(సి) శుభ్ మన్ గిల్
(డి) సచిన్ టెండూల్కర్
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశలో ఎన్ని చోట్ల ‘బెస్’ (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం) ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
3. ‘అన్నదాతా సుఖీభవ’ (Annadatha Sukhibhava) పథకానికి అర్హత సాధించని రైతులు ఏ ఫోన్ నంబర్ లో సంప్రదించాలి ?
(ఎ) 155251
(బి) 155252
(సి) 155253
(డి) 155254
4. భారతదేశంలో ‘బాడీ మాస్ ఇండెక్స్’ (BMI) ఎంత కంటే ఎక్కువ ఉన్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు ?
(ఎ) 25
(బి) 30
(సి) 35
(డి) 40
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని ‘ముదిగేడు-సంజామల’ మధ్య ‘డానిష్ ఫైబర్ టెక్నాలజీ’ అనే కొత్త సాంకేతికతతో 2025 జులై 4న రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ సాంకేతికత విధానాన్ని ఏ దేశంలో అభివృద్ధి చేశారు ?
(ఎ) నార్వే
(బి) స్వీడన్
(సి) ఫిన్లాండ్
(డి) డెన్మార్క్
6. దేశంలో జననాలు, మరణాల మధ్య సమతుల్యత ఏర్పడి జనాభా స్థిరంగా కొనసాగాలంటే సంపూర్ణ సంతానోత్పత్తి రేటు (TFR) ఎంతగా ఉండాలి ?
(ఎ) 2.0
(బి) 2.1
(సి) 3.0
(డి) 3.1
7. భారతదేశంలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ?
(ఎ) ఉత్తర్ ప్రదేశ్
(బి) మహారాష్ట్ర
(సి) కేరళ
(డి) ఆంధ్రప్రదేశ్
8. ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదంపై పోరుకు ప్రాంతీయ ఉగ్రవాద నిరోధ వ్యవస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
(ఎ) 2001
(బి) 2002
(సి) 2003
(డి) 2004
9. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ (Hollywood walk of fame star) కి ఎంపికైన తొలి భారతీయ నటి ?
(ఎ) దీపికా పదుకొణె
(బి) మాధురి దీక్షిత్
(సి) జయాబచ్చన్
(డి) ఐశ్వర్యారాయ్
10. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్ కు లభించిన స్థానం ?
(ఎ) 11
(బి) 12
(సి) 13
(డి) 14
GK Bits In Telugu 17 Year 2025 : సరియైన సమాధానాలు
(1) సి
వివరణ :
2025 జులైలో ఇంగ్లాండ్, భారత్ ల మధ్య జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత కెప్టెన్ ‘శుభ్ మన్ గిల్’ 269 (387 బంతుల్లో 304, 36) పరుగులు చేసి … విదేశీ గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి సారథిగా రికార్డు సృష్టించాడు. అతడికి టెస్టుల్లో ఇదే తొలి ద్విశతకం.
(2) సి
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,000 మెగావాట్ల ‘బెస్’ (Battery Energy Storage System) ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు భారత ప్రభుత్వం అనుమతించింది. తొలి దశలో 1,000 మెగావాట్ల (రెండు సైకిల్స్ లో) ‘బెస్’ ప్రాజెక్ట్ లు ఏర్పాటవుతాయి. వైఎస్సార్ కడప జిల్లాలోని ‘జమ్మలమడుగు’, కర్నూలు జిల్లాలోని ‘గని’, చిత్తూరు జిల్లాలోని ‘కుప్పం’ లలో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ లను సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్’ (NHPC) కు అప్పగించారు.
(3) ఎ
వివరణ :
‘అన్నదాతా సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు, వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ ‘ఢిల్లీరావు’ సూచించారు. అనర్హులైతే “155251” నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అతను వివరించారు.
(4) ఎ
(5) డి
వివరణ :
డానిష్ ఆస్ఫాల్డ్ రీ-ఇన్ఫోర్సింగ్ టెక్నాలజీగా పేర్కొనే ‘డానిష్ ఫైబర్ టెక్నాలజీ’ ని ‘డెన్మార్క్’ దేశంలో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో తారు మాత్రమే కాకుండా అరమిడ్, పాలియోలెఫిన్ అనే ఫైబర్లు కలిపి బిటమిన్ తయారు చేస్తారు. వాటితో నిర్మాణమైన రోడ్డు దృఢంగా ఉండి, వర్షపు నీటిని నిరోధిస్తుంది. దీంతో రోడ్డుకు పగుళ్లు రావు. త్వరగా గుంతలు పడవు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్లు తట్టుకోగలవని ఇంజినీర్లు చెబుతున్నారు. రహదారుల మన్నిక కూడా 50% పెరుగుతుందని పేర్కొంటున్నారు.
(6) బి
వివరణ :
ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం … 2024లో భారతదేశ జనాభా 146 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. కానీ, TFR మాత్రం 1.9 కి పడిపోయింది. పట్టణాల్లో అది మరీ తక్కువగా 1.6 గా ఉంది.
(7) సి
(8) బి
(9) ఎ
వివరణ :
‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ కు బాలీవుడ్ నటీమణి ‘దీపికా పదుకొణె’ ఎంపికైంది. తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా కూడా దీపికా పదుకొణె నిలిచింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కు ఈమెతో పాటు … హాలీవుడ్ తారలు డెమీ మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ లాంటి 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు ఛాంబర్ తెలిపింది. వినోద రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు గానూ వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
(10) బి
వివరణ :
క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రఖ్యాత ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ ‘టేస్ట్ అట్లాస్‘ ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాను ఇటీవల రూపొందించింది. ఈ జాబితాలో ‘గ్రీస్’ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 12వ స్థానంలో, అమెరికా 13వ స్థానంలో నిలిచాయి. ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలో ‘ముంబయి’ 5వ స్థానంలో ఉంది. వడాపావ్, పాప్ బాజీ వంటి ముంబయి వంటకాలకు అధిక రేటింగ్ లు వచ్చాయి. దిల్లీ 45వ స్థానం, హైదరాబాద్ 50వ స్థానం లో ఉన్నాయి. చెన్నై 75వ స్థానంలో ఉంది.