GK Bits In Telugu 18 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 18 Year 2025 : ప్రశ్నలు
1. టెస్ట్ క్రికెట్ కి సంబంధించి ఇంగ్లాండ్ లో ద్విశతకాలు చేసిన భారత ఆటగాళ్లలో ‘శుభ్ మన్ గిల్’ ఎన్నోవాడు ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
2. టెస్టులు, వన్డేల్లో ద్విశతకాలు చేసిన బ్యాటర్లలో ‘శుభ్ మన్ గిల్’ ఎన్నోవాడు ?
(ఎ) 1
(బి) 3
(సి) 5
(డి) 7
3. భారత ప్రధాని ‘నరేంద్ర మోదీ’ కి ఘనా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ ను ఆ దేశ అధ్యక్షుడు ‘జాన్ డ్రమానీ మహామా’ ఏ తేదీన ప్రదానం చేశారు ?
(ఎ) 2025 జులై 1
(బి) 2025 జులై 2
(సి) 2025 జులై 3
(డి) 2025 జులై 4
4. ఆరోగ్యరంగంలో దశాబ్దాలుగా వినిపించే ‘పారా మెడికల్’ అనే పదాన్ని ఇక వాడొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పదానికి బదులుగా ఏ పదాన్ని అధికారికంగా వాడాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) మెడికల్ ఎయిడ్
(బి) అలైడ్ అండ్ హెల్త్ కేర్
(సి) హెల్త్ కేర్ టేకర్
(డి) మెడికల్ డయాగ్నోసిస్
5. తెలుగు దేశం పార్టీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ‘పూసపాటి అశోక్ గజపతిరాజు’ ను ఏ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారు ?
(ఎ) కర్ణాటక
(బి) మహారాష్ట్ర
(సి) గుజరాత్
(డి) గోవా
6. ‘అసీంకుమార్ ఘోష్’ ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు ?
(ఎ) హరియాణా
(బి) గుజరాత్
(సి) పశ్చిమబెంగాల్
(డి) తమిళనాడు
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మొత్తం ఎంత మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదముంది ?
(ఎ) 36
(బి) 37
(సి) 38
(డి) 39
8. కర్ణాటక రాష్ట్రంలో అతి పెద్దది మరియు భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్న కేబుల్ వంతెనను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి ‘నితిన్ గడ్కరీ’ ఏ తేదీన ప్రారంభించారు ?
(ఎ) 2025 జులై 11
(బి) 2025 జులై 12
(సి) 2025 జులై 13
(డి) 2025 జులై 14
9. 2022లో నిర్వహించిన భారత జాతీయ జనాభా నమూనా సర్వే ప్రకారం .. 18 సంవత్సరాల లోపే పెళ్లిళ్లు అవుతున్న యువతులు గల రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉన్నది ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) పశ్చిమబెంగాల్
(డి) ఉత్తర్ ప్రదేశ్
10. 2022లో నిర్వహించిన భారత జాతీయ జనాభా నమూనా సర్వే ప్రకారం .. దేశ జనాభాలో 14 ఏళ్లలోపు వయసు గల బాలలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు ?
(ఎ) రాజస్థాన్
(బి) బిహార్
(సి) తెలంగాణ
(డి) ఆంధ్రప్రదేశ్
GK Bits In Telugu 18 Year 2025 : సరియైన సమాధానాలు
(1) సి
వివరణ :
సునీల్ గవాస్కర్ (221 ; 1979లో), రాహుల్ ద్రవిడ్ (217 ; 2002లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
(2) సి
వివరణ :
టెస్టులు, వన్డేల్లో ద్విశతకాలు చేసిన బ్యాటర్లు : సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, శుభ్ మన్ గిల్.
(3) సి
(4) బి
వివరణ :
నేషనల్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ల చట్టం-2021 ప్రకారం ఇకపై అన్ని ప్రభుత్వ, విద్య, ఆరోగ్య సంబంధిత వ్యవస్థల్లో ‘పారా మెడికల్’ అనే పదానికి బదులుగా ‘అలైడ్ అండ్ హెల్త్ కేర్’ (ఆరోగ్య సంరక్షణ సహాయకులు) అనే పదాన్ని అధికారికంగా వాడాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.
(5) డి
(6) ఎ
(7) బి
(8) డి
వివరణ :
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సిగందూరు సమీపాన శరావతి వెనుక జలాల మీద రూ. 473 కోట్లతో నిర్మించిన అతి పెద్ద కేబుల్ వంతెనను కేంద్ర మంత్రి ‘నితిన్ గడ్కరీ’ 2025 జులై 14న ప్రారంభించారు. ఈ కేబుల్ వంతెన కర్ణాటక రాష్ట్రంలోనే అతి పెద్దది మరియు ఇండియాలో 2వ స్థానంలో ఉంది. 2.14 కి.మీ. పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనలో 740 మీటర్లు కేబుల్ ఆధారంగా నిలిచి ఉంటుంది. ఈ వంతెనకు అమ్మవారి పేరు మీదుగా “సిగందూరు చౌడేశ్వరి వంతెన” (Sigandur Choudeswari Bridge) గా నామకరణం చేస్తున్నట్లు ఈ సందర్భంలో గడ్కరీ ప్రకటించారు.
(9) సి
వివరణ :
2022లో నిర్వహించిన భారత జాతీయ జనాభా నమూనా సర్వే ప్రకారం .. యువతుల్లో 2.3% మందికి 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇది తెలంగాణాలో 1.6%, ఆంధ్రప్రదేశ్ లో 1.7% గా ఉంది. ఈ విషయంలో 6.3% తో పశ్చిమబెంగాల్ మొదటి స్థానంలో ఉంది.
(10) బి
వివరణ :
భారతదేశ జనాభాలో 14 సంవత్సరాల లోపు వయసు గల బాలలు ‘బిహార్’ (ప్రథమ స్థానం) లో 32.4% మంది ఉన్నారు. ఇది తెలంగాణాలో 20.8%, ఆంధ్రప్రదేశ్ లో 19.7% గా ఉంది.
GK Bits In Telugu 17 Year 2025