Legal Advice For Just One Rupee : Details In Telugu

By Gk Bits Telugu

Published On:

LEGAL ADVICE FOR JUST ONE RUPEE

Join WhatsApp

Join Now

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు కు చెందిన ‘ఆదర్శ్’ లా చదువుతూనే … పేదలకు ఉచిత న్యాయ సహాయం (Legal advice for just one rupee) అందించాలనే ఉద్దేశ్యంతో 9 మంది ఫ్రెండ్స్ తో కలిసి ‘సీఎల్ఎన్ఎస్.ఇన్’ (https://clns.in/) అనే వెబ్ సైట్ ను రూపొందించారు. దీనికి అనూహ్య స్పందన రావడంతో ఈ విద్యార్ధి బృందం తమ కోర్సు పూర్తి అయిన తరవాత 2025వ సంవత్సరం మే నెలలో అంకుర సంస్థగా ‘సీఎల్ఎన్ఎస్’ (Centralized Legal Network Solutions) యాప్ ను రూపొందించారు. ఇందులో ఒక రూపాయి చెల్లించి … న్యాయ సేవలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులను భాగస్వామ్యం చేశామని, టీహబ్ (THUB) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నామని ఆదర్శ్ వివరించారు. ఇప్పటి వరకు 3,000 మందికి పైగా సహాయం అందించామని తెలిపారు.

‘న్యాయవాదిని వెతకండి’ (Find a lawyer), ‘అధికారులతో మాట్లాడండి’ (Talk to official), ‘మా సేవలు’ (Our services) ఎంపికల ద్వారా విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజలు, అధికారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా సాంకేతికతను రూపొందించినట్లు ఆదర్శ్ వెల్లడించారు. CLNS App లో రిజిస్టర్ చేసుకుని .. లాగ్ ఇన్ కావడం ద్వారా సేవలు పొందొచ్చు. Artificial Intelligence ను జోడించి కక్షిదారులకు అవసరమైన సమాచారం అందే ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

Leave a Comment