2026 January 22 GK Bits Telugu

By Gk Bits Telugu

Published On:

Join WhatsApp

Join Now

1వ ప్రశ్న : భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి “సునీతా విలియమ్స్” ఏ తేదీన పదవీ విరమణ చేసినట్లు నాసా ప్రకటించింది ?

(ఎ) 2025 డిసెంబర్ 25

(బి) 2025 డిసెంబర్ 26

(సి) 2025 డిసెంబర్ 27

(డి) 2025 డిసెంబర్ 28

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (సి) 2025 డిసెంబర్ 27.

2025 డిసెంబర్ 27వ తేదీన సునీతా విలియమ్స్ తమ సంస్థ నుంచి పదవీ విరమణ చేసినట్లు ‘నాసా’ అధికారికంగా వెల్లడించింది. 27 సంవత్సరాలకు పైగా ‘నాసా’ కోసం పనిచేసిన సునీతా విలియమ్స్ మూడు సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. ఆమె తన సుదీర్ఘ వృత్తి జీవితంలో 608 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో బస చేసి అత్యధిక కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు.

2వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన మార్కెట్ విలువల్ని ఏ తేదీ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది ?

(ఎ) 2026 ఫిబ్రవరి 1

(బి) 2026 మార్చ్ 1

(సి) 2026 ఏప్రిల్ 1

(డి) 2026 మే 1

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (ఎ) 2026 ఫిబ్రవరి 1.

3వ ప్రశ్న : అమెరికా భద్రత కోసం గ్రీన్ ల్యాండ్ ను యాజమాన్య హక్కుతో సహా తీసుకోవాలని అనుకుంటున్నామని, దానికి బలప్రయోగం మాత్రం చేయబోమని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రీన్ ల్యాండ్ ఏ దేశ ఆధీనంలో ఉంది ?

(ఎ) నార్వే

(బి) డెన్మార్క్

(సి) స్వీడన్

(డి) ఫిన్లాండ్

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (బి) డెన్మార్క్.

4వ ప్రశ్న : చట్టసభల సభాపతుల 86వ అఖిలభారత మహాసభ ఎక్కడ జరిగింది ?

(ఎ) దిల్లీ

(బి) చెన్నై

(సి) కోల్ కతా

(డి) లఖ్ నవూ

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (డి) లఖ్ నవూ.

5వ ప్రశ్న : “ప్రశ్న మీది … గొంతు నాది” పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ ?

(ఎ) కింజరపు రామ్మోహన్ నాయుడు

(బి) కలిశెట్టి అప్పలనాయుడు

(సి) పుట్టా మహేశ్ కుమార్

(డి) పెమ్మసాని చంద్రశేఖర్

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (సి) పుట్టా మహేశ్ కుమార్.

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ “ప్రశ్న మీది … గొంతు నాది” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను 9618194377, 9885519299 అనే ఫోన్ నంబర్లకు వాట్సాప్ చేయవచ్చని మహేశ్ కుమార్ తెలిపారు. కొన్ని ఉత్తమ ప్రశ్నలను ఎంపిక చేసి … వాటిని ప్రజల తరపున రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని … ఆ ప్రశ్నలు పంపిన వారిని పార్లమెంట్ కు ఆహ్వానించి ఒక రోజు సందర్శకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

6వ ప్రశ్న : 2025లో ప్రపంచంలో అత్యంత కలుషిత దేశాల జాబితాలో భారత్ స్థానం ?

(ఎ) 5

(బి) 6

(సి) 7

(డి) 8

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (ఎ) 5.

7వ ప్రశ్న : ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న రేబిస్ మరణాల్లో భారత్ లో ఎంత శాతం జరుగుతున్నాయి ?

(ఎ) 35

(బి) 36

(సి) 37

(డి) 38

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (బి) 36.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న రేబిస్ మరణాల్లో భారత్ లోనే 36% జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం 2022లో 21.89 లక్షలు, 2023లో 30.52 లక్షలు, 2024లో 37.15 లక్షల మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి.

8వ ప్రశ్న : మనదేశంలో గోవా ఏ సంవత్సరంలో రేబిస్ రహిత రాష్ట్రంగా అవతరించింది ?

(ఎ) 2016

(బి) 2017

(సి) 2018

(డి) 2019

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (సి) 2018.

గోవా 2018లో రేబిస్ రహిత రాష్ట్రంగా అవతరించింది. 5 సంవత్సరాలపాటు “మిషన్ రేబిస్” ను విజయవంతంగా అమలు చేసింది. ఒక లక్ష కుక్కలకు టీకాలు వేయించడంతోపాటు పాఠశాలల్లో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి 5 లక్షల 20 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను చైతన్యపరిచింది.

9వ ప్రశ్న : అంగన్ వాడీ కేంద్రానికి అందించే ప్రతి ఒక్క కిట్ లో ఎన్ని రకాల మందులు ఉంటాయి ?

(ఎ) 8

(బి) 9

(సి) 10

(డి) 11

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (డి) 11.

అంగన్ వాడీ కేంద్రానికి అందించే ప్రతి ఒక్క కిట్ లో 11 రకాల మందులు ఉంటాయి.

10వ ప్రశ్న : ఏ సంవత్సరానికి సంబంధించి ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి “గ్రాసా మచెల్” ఎంపికయ్యారు ?

(ఎ) 2022

(బి) 2023

(సి) 2024

(డి) 2025

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ (డి) 2025.

మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య “గ్రాసా మచెల్” … 2025 ఏడాదికి గానూ ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. పురస్కారంతో పాటు ఒక కోటి రూపాయల నగదు బహుమతిని కూడా ఆమెకు లభిస్తుంది.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

🔴Related Post

Leave a Comment