GK Test : 1 ; Year : 2026 – GK Bits Telugu

By Gk Bits Telugu

Published On:

Join WhatsApp

Join Now

(1) మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత ‘అజిత్ పవార్’ దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో నలుగురు చనిపోయారు. ఈ సంఘటన ఏ తేదీన జరిగింది ?

(ఎ) 2026 జనవరి 26

(బి) 2026 జనవరి 27

(సి) 2026 జనవరి 28

(డి) 2026 జనవరి 29

(2) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం ఎన్ని న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి ?

(ఎ) 36

(బి) 37

(సి) 38

(డి) 39

(3) కృత్రిమ మేధ సహాయంతో రూపొందించిన “ధర్మ” అనే యాప్ (DHARMA App) ను ఏ జిల్లా పోలీసులు వినియోగిస్తున్నారు ?

(ఎ) ఎన్టీఆర్

(బి) ఏలూరు

(సి) కాకినాడ

(డి) అనకాపల్లి

(4) “2021 జైన్, గోలి నివేదిక” ప్రకారం … భారతదేశంలో పని చేసే జనాభా సంఖ్య 2026లో 64.8% ఉండగా అది 2031 నాటికి ఎంతకు పెరగబోతోంది ?

(ఎ) 65.1%

(బి) 66.1%

(సి) 67.1%

(డి) 68.1%

(5) భారతదేశంలో అత్యధిక వృద్ధులు ఉన్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్నది ?

(ఎ) కేరళ

(బి) తమిళనాడు

(సి) హిమాచల్ ప్రదేశ్

(డి) పంజాబ్

(6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011-13 లెక్కల ప్రకారం సగటున ఒక్కో మహిళ 1.8 మందికి జన్మనివ్వగా 2021-23 నాటికి అది ఎంతకు పడిపోయింది ?

(ఎ) 1.7

(బి) 1.6

(సి) 1.5

(డి) 1.4

(7) భారతదేశ తొలి బడ్జెట్ ను ఏ తేదీన ప్రవేశపెట్టారు ?

(ఎ) 1860 ఏప్రిల్ 5

(బి) 1860 ఏప్రిల్ 6

(సి) 1860 ఏప్రిల్ 7

(డి) 1860 ఏప్రిల్ 8

(8) స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ను 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కింది ?

(ఎ) హిరూ భాయీ ముల్జీ భాయీ

(బి) టి.టి. కృష్ణమాచారి

(సి) డా. బీ ఆర్ అంబేద్కర్

(డి) ఆర్ కె షణ్ముఖం చెట్టి

(9) టి టి కృష్ణమాచారి రాజీనామా చేయడంతో ఏ సంవత్సరంలో భారత ప్రధాని ‘జవహర్ లాల్ నెహ్రూ’ స్వయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ?

(ఎ) 1957

(బి) 1958

(సి) 1956

(డి) 1955

(10) ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత ‘మొరార్జీ దేశాయ్’ సొంతం. అతను మొత్తమ్మీద ఎన్నిసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ?

(ఎ) 6

(బి) 8

(సి) 10

(డి) 12

సమాధానాలు

(1) సి

(2) బి

వివరణ :

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొత్తం 37 న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 32 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు.

(3) బి

వివరణ :

ఏలూరు జిల్లా ఎస్పీ ‘కేపీఎస్ కిశోర్’ ఆధ్వర్యంలో ‘ధర్మ’ పేరిట ప్రత్యేకంగా ఓ యాప్ ను పోలీసుల అంతర్గత వినియోగం కోసం రూపొందించారు. న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసులపై అవగాహన కలిగిన హెడ్ కాన్స్టేబుల్స్ ను ఎంపిక చేసి ‘కోర్ట్ మానిటరింగ్ సెల్’ (CMC) ను ఏర్పాటు చేశారు.

(4) ఎ

వివరణ :

“2021 జైన్, గోలి నివేదిక” (2021 Jain, Goli Report) ప్రకారం … భారతదేశంలో పని చేసే జనాభా సంఖ్య 2026లో 64.8% ఉండగా అది 2031 నాటికి 65.1%కి పెరగబోతోంది. 2036 నాటికి అది 64.9% కు చేరుతుంది.

2021 Jain, Goli Report ప్రకారం … ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జనాభాలో ప్రస్తుతం పని చేసే వారి సంఖ్య 66.9%గా ఉంది. 2031 నాటికి అది 66.4% అవుతుంది. 2036 నాటికి దాదాపు ఒక శాతం తగ్గినా 65.4%గా ఉంటుంది.

(5) ఎ

వివరణ :

కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లు భారతదేశంలో అత్యధిక వృద్ధులు ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. 2036 నాటికి పంజాబ్ ను వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ జనాభాలో ప్రస్తుతం (2026) 60 ఏళ్ళు దాటిన వృద్ధులు 14.1% గా ఉన్నారు. 2031 నాటికి ఇది 16.4%కి పెరుగుతుంది. 2036 నాటికి ఏకంగా 18.9 శాతానికి చేరుతుందని అంచనా.

భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జనాభాలో 11.4% వృద్ధులు ఉన్నారు. 2031 నాటికి ఆ సంఖ్య 13.1%కి, 2036 నాటికి 14.9%కి చేరుతుంది.

(6) సి

వివరణ :

సాధారణంగా జనాభా తగ్గకుండా ఉండాలంటే ఒక్కో మహిళ సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి. ఐక్య రాజ్య సమితి ప్రపంచ సంతానోత్పత్తి రేటు నివేదిక ఆధారంగా ఈ ఫార్ములా ప్రస్తావించారు.

(7) సి

వివరణ :

ఈస్టిండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు ‘జేమ్స్ విల్సన్’ 1860 ఏప్రిల్ 7వ తేదీన అప్పటి బ్రిటన్ రాణికి భారతదేశ మొట్టమొదటి బడ్జెట్ ను సమర్పించారు.

(8) డి

(9) బి

వివరణ :

టి టి కృష్ణమాచారి రాజీనామాతో 1958లో జవహర్ లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్ రాజీనామాతో 1970లో ఇందిరాగాంధీ, వి పి సింగ్ రాజీనామాతో 1987లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా ఉంటూనే బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆయా సమయాలలో వారే ఆర్ధిక మంత్రులుగా ఉన్నారు.

(10) సి

వివరణ :

మొరార్జీ దేశాయ్ తర్వాతి స్థానంలో పి. చిదంబరం ఉన్నారు. అతను 9 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అతని తర్వాతి స్థానంలో నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఆమె 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2026 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడితే ఆమె కూడా 9 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లవుతుంది.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

🔴Related Post

Leave a Comment