(1) భారతదేశ బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు ఏ ఆర్ధికమంత్రి పేరిట ఉంది ?
(ఎ) ఆర్.కె. షణ్ముఖం చెట్టి
(బి) టి.టి. కృష్ణమాచారి
(సి) నిర్మలా సీతారామన్
(డి) యశ్వంత్ సిన్హా
(2) భారతదేశ బడ్జెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన ఆర్ధికమంత్రిగా ‘హిరూభాయి ముల్జీభాయి పటేల్’ నిలిచారు. ఈ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది ?
(ఎ) 1977
(బి) 1978
(సి) 1979
(డి) 1980
(3) భారతదేశంలో బడ్జెట్ ప్రతుల్ని లెదర్ సూట్ కేస్ లో పార్లమెంటుకు తీసుకొచ్చేవారు. బ్రిటిష్ పాలన కాలం నాటి నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి ఏ సంవత్సరంలో ‘నిర్మలా సీతారామన్’ తెరదించారు ?
(ఎ) 2019
(బి) 2020
(సి) 2021
(డి) 2022
(4) ఫిబ్రవరి 1న పద్దును ప్రవేశపెట్టే చరిత్రాత్మక మార్పునకు ఏ సంవత్సరంలో శ్రీకారం చుట్టారు ?
(ఎ) 2016
(బి) 2017
(సి) 2018
(డి) 2019
(5) భారతదేశ బడ్జెట్ ను ఏ సంవత్సరం నుంచి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం ప్రారంభించారు ?
(ఎ) 1996
(బి) 1997
(సి) 1998
(డి) 1999
(6) ఏ సంవత్సరం వరకు భారతదేశంలో రైల్వే బడ్జెట్ ను విడిగా ప్రవేశపెట్టేవారు ?
(ఎ) 2014
(బి) 2015
(సి) 2016
(డి) 2017
(7) భారతదేశంలోనే తొలిసారిగా ఏ ఆసుపత్రిలో ‘పీవై టెస్ట్’ (PY Test) ను అందుబాటులోకి తెచ్చారు ?
(ఎ) అపోలో
(బి) మెడికవర్
(సి) కిమ్స్
(డి) ఏఐజీ
(8) 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని “కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు” రంగాల్లో విశేష కృషి చేసిన మొత్తం ఎంత మందికి పద్మ అవార్డులను (Padma Awards 2026) 2026 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
(ఎ) 131
(బి) 132
(సి) 133
(డి) 134
(9) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “కుప్పం” నియోజకవర్గంలో 24 గంటల్లో ఎన్ని ఈ-సైకిళ్లను రాయితీపై ప్రజలకు పంపిణీ చేసి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ సృష్టించింది ?
(ఎ) 4,444
(బి) 5,555
(సి) 6,666
(డి) 7,777
(10) ఏ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ‘సునేత్రా పవార్’ ఖ్యాతి గడించారు ?
(ఎ) కర్ణాటక
(బి) ఉత్తర్ ప్రదేశ్
(సి) మహారాష్ట్ర
(డి) రాజస్థాన్
సమాధానాలు
(1) సి
వివరణ :
2020 ఫిబ్రవరి 1న పద్దు (Budget) ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ ఏకంగా 2 గంటల 42 నిమిషాలపాటు మాట్లాడారు. చివరకు ఒంట్లో నలతగా ఉండటంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు.
(2) ఎ
వివరణ :
1977లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతూ హిరూభాయి ముల్జీభాయి పటేల్ (Hirubhai Mulljibhai Patel) తన ప్రసంగాన్ని కేవలం 800 పదాల్లో ముగించారు.
(3) ఎ
వివరణ :
భారతదేశంలో బడ్జెట్ ప్రతుల్ని 2018 వరకూ లెదర్ సూట్ కేస్ లో పార్లమెంటుకు తీసుకొచ్చేవారు. బ్రిటిష్ పాలన కాలం నాటి నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి 2019వ సంవత్సరంలో ‘నిర్మలా సీతారామన్’ తెరదించారు. ఆ ఏడాది తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె … వాటి ప్రతుల్ని ‘బహీ ఖాతా’ (Bahi Khata) గా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్ లో తీసుకొచ్చారు. దానిపై జాతీయ చిహ్నాన్ని కూడా అమర్చారు. తద్వారా భారతీయత ఉట్టిపడేలా చేశారు.
2021లో కొత్తగా డిజిటల్ బడ్జెట్ (Digital Budget) కు నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు.
(4) బి
వివరణ :
ఫిబ్రవరి 1న పద్దును ప్రవేశపెట్టే చరిత్రాత్మక మార్పునకు 2017లో అప్పటి ఆర్ధిక మంత్రి ‘అరుణ్ జైట్లీ’ శ్రీకారం చుట్టారు. దీని వల్ల నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్ కు సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేయడానికి తగినంత సమయం అందుబాటులో ఉంటోంది.
(5) డి
వివరణ :
బ్రిటన్ టైమ్ జోన్ కు అనుగుణంగా వలస పాలన సమయంలో మన దేశ బడ్జెట్ ను సాయంత్రం 5 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా చాలా సంవత్సరాలు అదే తంతు కొనసాగింది. 1999లో అప్పటి ఆర్ధిక మంత్రి ‘యశ్వంత్ సిన్హా’ తొలిసారిగా ఉదయం 11 గంటలకు పద్దును ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా కొనసాగుతోంది.
(6) సి
వివరణ :
2016 వరకు రైల్వే బడ్జెట్ ను విడిగా ప్రవేశపెట్టేవారు. 2017 నుంచి కేంద్ర బడ్జెట్ లోనే దాన్ని భాగంగా మార్చారు.
(7) డి
వివరణ :
తీవ్రమైన జీర్ణకోశ సమస్యలకు కారణమయ్యే ‘హెలికోబాక్టర్ పైలోరీ’ (హెచ్. పైలోరీ) ఇన్ఫెక్షన్ ను గుర్తించే శ్వాస పరీక్ష (PY Test) హైదరాబాద్ గచ్చిబౌలి లోని ‘ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ (AIG) లో దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది.
నోబెల్ బహుమతి గ్రహీత, హెచ్. పైలోరీ బ్యాక్టీరియాను కనుగొన్న ‘ప్రొఫెసర్ బారీ మార్షల్’ ఈ పీవై టెస్ట్ ను అభివృద్ధి చేశారు. ట్రైమెడ్ (Tri-Med) సంస్థ ఈ కిట్ ను తయారు చేసింది. తీవ్రమైన గ్యాస్ట్రిక్ వ్యాధులను ముందుగా గుర్తించి అడ్డుకునేందుకు ఈ PY Test ఎంతో ఉపయోగపడుతుంది.
(8) ఎ
వివరణ :
2026 జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఐదుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ ను, 13 మందికి ‘పద్మ భూషణ్’ ను, 113 మందికి ‘పద్మశ్రీ’ లను ప్రకటించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మ అవార్డులను విజేతలకు ప్రదానం చేస్తారు.
(9) బి
(10) సి
వివరణ :
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ దివంగత అధినేత ‘అజిత్ పవార్’ సతీమణి “సునేత్రా పవార్” 2026 జనవరి 31న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేశారు.

