GK Bits In Telugu 14 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 14 Year 2025 : ప్రశ్నలు
1. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా సమానత్వ పరంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
2. నిజమైన విశ్వాసమనే బలిపీఠం వద్ద మహమ్మద్ ప్రవక్త మనవడు ‘హజ్రత్ ఇమామ్ హుస్సేన్’ బలిదానాన్ని గుర్తు చేసేది ?
(ఎ) మొహర్రం
(బి) బక్రీద్
(సి) రంజాన్
(డి) మిలాద్-ఉన్-నబి
3. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాల ప్రకారం 2019-21లో భారతదేశంలో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
4. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ఏ భాషకు ‘బుకర్’ బహుమతి లభించింది ?
(ఎ) తెలుగు
(బి) కన్నడ
(సి) మళయాళం
(డి) తమిళం
5. ప్రపంచ అవినీతి సూచీ-2024 (Corruption Perceptions Index-2024) లో ఏ దేశం అత్యధికంగా 90 స్కోర్ సాధించి అవినీతి చాలా తక్కువగా ఉన్న దేశంగా నిలిచింది ?
(ఎ) న్యూజిలాండ్
(బి) నార్వే
(సి) సింగపూర్
(డి) డెన్మార్క్
6. భారత నౌకాదళంలో ఏవియేషన్ ఫైటర్ స్ట్రీమ్ (Aviation Fighter Stream) కు ఎంపికైన తొలి మహిళా అధికారిణి ?
(ఎ) శివాంగి సింగ్
(బి) అవని చతుర్వేది
(సి) ఆస్థా పూనియా
(డి) మోహనా సింగ్
7. భారత నౌకాదళంలో నియమింపబడిన తొలి మహిళా పైలట్ ?
(ఎ) శివాంగి సింగ్
(బి) అవని చతుర్వేది
(సి) భావనా కాంత్
(డి) మోహనా సింగ్
8. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలు సాధించిన ఎన్నో భారత కెప్టెన్ గా ‘శుభ్ మన్ గిల్’ నిలిచాడు ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
9. 2025 జులై 5 నాటికి ఓ టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో ‘శుభ్ మన్ గిల్’ ఎన్నో స్థానంలో ఉన్నాడు ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
10. ఓ టెస్ట్ మ్యాచ్ లో రెండు 150+ స్కోర్లు సాధించిన మొదటి బ్యాటర్ ?
(ఎ) శుభ్ మన్ గిల్ (భారత్)
(బి) గ్రాహం గూచ్ (ఇంగ్లాండ్)
(సి) బ్రయాన్ లారా (వెస్ట్ ఇండీస్)
(డి) అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)
GK Bits In Telugu 14 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
వివరణ :
2011-12 లో భారతదేశంలో అత్యంత పేదరికం 16.2% గా ఉండగా, 2022-23 కు 2.3% కి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదికలో పేర్కొంది. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల సక్రమ అమలు వల్లే దేశంలో అసమానతలు తగ్గినట్లు నివేదికలో వివరించింది. ఉత్తమ జీనీ ఇండెక్స్ స్కోర్ (Gini Index) ఆధారంగా సమానత్వాన్ని లెక్కించింది. ఈ జాబితాలో స్లోవక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. చైనా, అమెరికా, యూకే కంటే భారత్ మెరుగుపడి 4వ స్థానంలో నిలిచింది.
భారత జీనీ ఇండెక్స్ 25.5 గా నమోదైంది. ఒక దేశంలో కుటుంబాలు లేదా వ్యక్తుల మధ్య ఆదాయం, సంపద లేదా వినియోగం సమానంగా ఎలా పంపిణీ అవుతుందో అర్ధం చేసుకునేందుకు జీనీ ఇండెక్స్ సాయపడుతుంది. దీని విలువ 0-100 శ్రేణిలో ఉంటుంది. జీనీ ఇండెక్స్ స్కోర్ ‘0’ ఉంటే కచ్చితమైన సమానత్వం ఉన్నట్లు పరిగణిస్తారు. 100 ఉంటే అందరి బదులు, ఒక వ్యక్తి వద్ద సంపద అంతా పోగుపడినట్లుగా పరిగణిస్తారు. చైనా స్కోర్ 35.7, అమెరికా స్కోర్ 41.8 గా ఉంది. 167 దేశాల డేటాను ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, గత దశాబ్ద కాలంలో 17.1 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికం నుంచి బయటకు వచ్చారు.
(2) ఎ
(3) సి
వివరణ :
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాల ప్రకారం 2019-21లో భారతదేశంలో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 42.44%తో 3వ స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో తెలంగాణ (60.7%), తమిళనాడు (44.94%) ఉన్నాయి.
(4) బి
వివరణ :
2025 మే నెలలో కన్నడ కథారచయిత్రి ‘బాను ముష్తాక్’ (Banu Mushtaq) కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బుకర్ బహుమతిని ప్రకటించారు. అలా దక్షిణ భారతదేశ భాషకు మొదటిసారి బుకర్ బహుమతి లభించింది.
(5) డి
వివరణ :
ప్రపంచ అవినీతి సూచీ-2024లో భారత్ స్కోర్ 38.
(6) సి
వివరణ :
సబ్ లెఫ్టినెంట్ ‘ఆస్థా పూనియా’ … భారత నౌకాదళంలో ఏవియేషన్ ఫైటర్ స్ట్రీమ్ కు ఎంపికైన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు.
(7) ఎ
వివరణ :
2019లో లెఫ్టినెంట్ ‘శివాంగి సింగ్’ భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్ అయ్యారు.
(8) సి
వివరణ :
టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలు సాధించిన మూడో భారత కెప్టెన్ గా ‘శుభ్ మన్ గిల్’ నిలిచాడు. ఇతని కంటే ముందు వరుసలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
(9) బి
వివరణ :
2025 జులై 2-6 తేదీలలో భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగిన 2వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత బ్యాటర్ ‘శుభ్ మన్ గిల్’ మొత్తం 430 (మొదటి ఇన్నింగ్స్ : 269 ; రెండవ ఇన్నింగ్స్ : 161) పరుగులు చేశాడు. ఓ టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో అతడు ‘గ్రాహం గూచ్’ (456) తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు.
(10) డి
వివరణ :
ఓ టెస్ట్ మ్యాచ్ లో రెండు 150+ స్కోర్లు సాధించిన మొదటి బ్యాటర్ గా ‘అలెన్ బోర్డర్’ (150*, 153; పాకిస్థాన్ పై 1980లో) ఘనత సాధించాడు. 2వ బ్యాటర్ గా ‘శుభ్ మన్ గిల్’ నిలిచాడు.