GK Bits In Telugu 19 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 19 Year 2025 : ప్రశ్నలు
1. ఏ దేశ ప్రధాని నివాసాన్ని ‘చెకర్స్’ (Chequers) గా పిలుస్తారు ?
(ఎ) రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్
(బి) బెల్జియం
(సి) ఫ్రాన్స్
(డి) బ్రిటన్
2. భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఏ తేదీన చరిత్రాత్మక స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (FTA) లాంఛనప్రాయంగా కుదిరింది ?
(ఎ) 2025 జులై 21
(బి) 2025 జులై 22
(సి) 2025 జులై 23
(డి) 2025 జులై 24
3. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) చైర్మన్ గా ఎవరిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం 2025 జులై 24న ప్రకటించింది ?
(ఎ) దేవాశిష్ పండా
(బి) కె. సత్యనారాయణ మూర్తి
(సి) అజయ్ సేథ్
(డి) వివేక్ యాదవ్
4. ‘అంతర్జాతీయ న్యాయ శ్రేయో దినోత్సవం’ (International Day for Judicial Well-being) ను ఏ తేదీన నిర్వహిస్తారు ?
(ఎ) జులై 25
(బి) జులై 26
(సి) జులై 27
(డి) జులై 28
5. జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సహాయం అవసరం అయితే … ఏ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలి ?
(ఎ) 1031
(బి) 1032
(సి) 1033
(డి) 1034
6. ‘ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం’ (World IVF Day) ను ఏ తేదీన నిర్వహిస్తారు ?
(ఎ) జులై 25
(బి) జులై 26
(సి) జులై 27
(డి) జులై 28
7. ‘నరేంద్ర మోదీ’ భారత ప్రధానిగా తొలిసారి పదవి చేపట్టిన తేదీ ?
(ఎ) 2014 మే 25
(బి) 2014 మే 26
(సి) 2014 మే 27
(డి) 2014 మే 28
8. రోజుకు 7వేల అడుగులు నడవడంతో మరణ ముప్పు ఎంత శాతం తగ్గుతుందని ‘లాన్సెట్’ (LANCET) తాజా నివేదిక పేర్కొంది ?
(ఎ) 27%
(బి) 37%
(సి) 47%
(డి) 57%
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ భూముల్లాగే నగరపాలక సంస్థల పరిధిలోని ఇళ్లు, ఫ్లాట్లకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే యజమాని పేరుతో ఆస్తి బదలాయింపు ఆటోమేటిగ్గా (Auto Mutation) జరగబోతోంది. ఈ కొత్త విధానం 2025 ఆగష్టు 1 నుంచి రాష్ట్రంలోని ఎన్ని కార్పోరేషన్ల పరిధిలో అమల్లోకి రాబోతోంది ?
(ఎ) 16
(బి) 17
(సి) 18
(డి) 19
10. విద్యాహక్కు చట్టం ప్రకారం 1-8 తరగతుల విద్యార్థులకు పాఠశాల తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి. బడి దూరంగా ఉంటే పిల్లలు వెళ్లి, వచ్చేందుకు రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లించాలి. ఈ రవాణా చార్జీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం భరించాలి ?
(ఎ) 40%, 60%
(బి) 50%, 50%
(సి) 60%, 40%
(డి) 70%, 30%
GK Bits In Telugu 19 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
(2) డి
వివరణ :
భారత్, బ్రిటన్ దేశాల మధ్య 2025 జులై 24న కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీ ఏ) వలన ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం అవుతుంది. బ్రిటన్ కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గుతుంది. దుస్తులు సహా చాలా వ్యవసాయరంగ, ఆహారశుద్ధి ఉత్పత్తులకు టారిఫ్ ను లండన్ పూర్తిగా మినహాయిస్తుంది. బ్రిటన్ (UK) నుంచి దిగుమతి అయ్యే స్కాచ్ విస్కీ, జిన్ లపై సుంకాన్ని మనదేశం సగానికి తగ్గిస్తుంది.
ఈ ‘ఎఫ్ టీ ఏ’ కు అధికారికంగా “సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం” (సెటా) గా నామకరణం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేసుకోవాలని దిల్లీ, లండన్ తాజాగా తీర్మానించుకున్నాయి. ఈ సందర్భంగా భారత్, బ్రిటన్ లు ‘విజన్ 2035’ (Vision 2035) ను ఆవిష్కరించాయి.
(3) సి
వివరణ :
‘ఐ ఆర్ డీ ఏ ఐ’ చైర్మన్ గా అజయ్ సేథ్ వచ్చే 3 సంవత్సరాలు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతారని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేథ్, ఈ ఏడాది జూన్ లో ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శిగా 4 సంవత్సరాలపాటు పనిచేశాక పదవీ విరమణ చేశారు. ఈ ఏడాది మార్చిలో దేవాశిష్ పండా పదవీ కాలం ముగిసిన తర్వాత, IRDAI చైర్మన్ పదవి 4 నెలలపాటు ఖాళీగానే ఉంది.
(4) ఎ
(5) సి
(6) ఎ
(7) బి
వివరణ :
భారతదేశంలో వరసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న 2వ నేతగా ‘ఇందిరాగాంధీ’ పేరిట ఉన్న రికార్డును ‘నరేంద్ర మోదీ’ అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ 2025 జులై 25వ తేదీ నాటికి 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. దివంగత ఇందిరాగాంధీ 24.01.1966 నుంచి 24.03.1977 వరకు 4,077 రోజులు ప్రధానిగా ఉన్నారు. దేశ మొదటి ప్రధాని ‘జవహర్ లాల్ నెహ్రూ’ మొదట ఈ రికార్డు సాధించారు. వరసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ, మోదీ లకు దక్కుతుంది.
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి నరేంద్ర మోదీకే చెందుతుంది. 2001లో గుజరాత్ సీఎం అయిన ఆయన 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుండి ప్రధానిగా ఉన్నారు.
భారతదేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీపక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోదీ మాత్రమే. 2002, 2007, 2012 లలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన సీఎం అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు.
(8) సి
వివరణ :
రోజుకు 7,000 అడుగులు నడిస్తే మరణ ముప్పు 47% తగ్గడంతోపాటు మతిమరుపు 38%, కుంగుబాటు 22% మేర తగ్గుతాయని ‘లాన్సెట్’ తాజా నివేదిక వెల్లడించింది. 11 ఏళ్లలో (2014-25) నిర్వహించిన 88 అధ్యయనాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను ప్రచురించింది.
(9) బి
(10) సి
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులకు రవాణా చార్జీలను చెల్లించనున్నారు. 1-5 తరగతులు ఉండే ప్రాథమిక పాఠశాల .. ఆవాసానికి ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్నా, 6,7,8 తరగతుల పాఠశాలలు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 600 చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తారు.




