GK Bits In Telugu 2 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 2 Year 2025 : ప్రశ్నలు
1. ఏ దేశంలో జరిగిన భూకంప ఘటనలో భారతదేశం ‘ఆపరేషన్ బ్రహ్మ’ (Operation Brahma) పేరుతో సహాయక చర్యలు చేపట్టింది ?
(ఎ) బంగ్లాదేశ్
(బి) భూటాన్
(సి) నేపాల్
(డి) మయన్మార్
2. 2014లో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక వారణాసిలో ‘నరేంద్ర మోదీ’ 50వ పర్యటన జరిపిన తేదీ ?
(ఎ) 2025 ఏప్రిల్ 11
(బి) 2025 ఏప్రిల్ 12
(సి) 2025 ఏప్రిల్ 13
(డి) 2025 ఏప్రిల్ 14
3. ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యక్రమాలను పర్యవేక్షించే ‘నాగరిక్ అపుర్తి నిగమ్’ (NAN) కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
(ఎ) ఉత్తరాఖండ్
(బి) హిమాచల్ ప్రదేశ్
(సి) ఛత్తీస్ గఢ్
(డి) జార్ఖండ్
4. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద పౌరులు సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చు ?
(ఎ) 31
(బి) 32
(సి) 33
(డి) 34
5. ముంబయి ఉగ్రదాడి (26/11) ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన ‘తహవ్వుర్ రాణా’ ను భారత అధికారులు ఏ తేదీన అమెరికా నుంచి దిల్లీ కి విజయవంతంగా తీసుకొచ్చారు ?
(ఎ) 2025 ఏప్రిల్ 8
(బి) 2025 ఏప్రిల్ 9
(సి) 2025 ఏప్రిల్ 10
(డి) 2025 ఏప్రిల్ 11
6. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏ తేదీన కలకత్తాలోని తాత్కాలిక కార్యాలయంలో ప్రారంభమైంది ?
(ఎ) 1931, ఏప్రిల్ 1
(బి) 1934, ఏప్రిల్ 1
(సి) 1935, ఏప్రిల్ 1
(డి) 1937, ఏప్రిల్ 1
7. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ?
(ఎ) జస్టిస్ పి.ఎస్. నరసింహ
(బి) జస్టిస్ సంజీవ్ ఖన్నా
(సి) జస్టిస్ బి.ఆర్. గవాయ్
(డి) జస్టిస్ కె.వి. విశ్వనాథన్
8. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 3,330 డాలర్లకు ఏ తేదీన చేరింది ?
(ఎ) 2025 ఏప్రిల్ 16
(బి) 2025 ఏప్రిల్ 17
(సి) 2025 ఏప్రిల్ 18
(డి) 2025 ఏప్రిల్ 19
9. ‘ట్రీమ్యాన్’ గా గుర్తింపు పొందిన “గుంథీరామ్ జెనా” యొక్క స్వరాష్ట్రం ?
(ఎ) ఒడిశా
(బి) ఛత్తీస్ గఢ్
(సి) జార్ఖండ్
(డి) బీహార్
10. ‘అరవింద్ పనగడియా’ కి ఉన్న ప్రస్తుత హోదా ?
(ఎ) 14వ ఆర్థికసంఘం చైర్మన్
(బి) 15వ ఆర్థికసంఘం చైర్మన్
(సి) 16వ ఆర్థికసంఘం చైర్మన్
(డి) 17వ ఆర్థికసంఘం చైర్మన్
GK Bits In Telugu 2 Year 2025 – సరియైన సమాధానాలు
(1) డి
(2) ఎ
(3) సి
(4) బి
(5) సి
(6) సి
(7) సి
వివరణ :
ప్రస్తుత సీజేఐ ‘జస్టిస్ సంజీవ్ ఖన్నా’ 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. మే 14వ తేదీన ‘జస్టిస్ బి.ఆర్. గవాయ్’ (జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్) తదుపరి సీజేఐ గా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆరు నెలలకు పైగా సీజేఐ గా కొనసాగనున్న జస్టిస్ బి.ఆర్. గవాయ్ 2025 నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. సీజేఐ గా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఆయన కన్నా ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవిని అలంకరించారు.
(8) ఎ
వివరణ :
పుత్తడి ధర 3,300 డాలర్లను తాకడం చరిత్రలో ఇదే మొదటిసారి.
(9) ఎ
(10) సి