GK Bits In Telugu 20 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 20 Year 2025 : ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంపదను గణనీయంగా వృద్ధి చేయడం, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్ల పంపిణీని ఏ తేదీ నుంచి ప్రారంభించారు ?
(ఎ) 2025 జులై 1
(బి) 2025 జులై 2
(సి) 2025 జులై 3
(డి) 2025 జులై 4
2. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి ఉపయోగపడే ‘అజైల్’ (AGILE = Agriculture Input Licence Engine) యాప్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ‘రాజశేఖర్’ ఏ తేదీన ప్రారంభించారు ?
(ఎ) 2025 జులై 1
(బి) 2025 జులై 2
(సి) 2025 జులై 3
(డి) 2025 జులై 4
3. సీపీఐ (CPI) శత వసంతోత్సవాలను 2025 డిసెంబర్ 26వ తేదీన ఎక్కడ నిర్వహించనున్నారు ?
(ఎ) భద్రాచలం
(బి) వరంగల్
(సి) విజయనగరం
(డి) ఖమ్మం
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి వనరుల నిర్వహణపై జలవనరులశాఖ నిర్వహించే వెబ్ సైట్ పేరు ?
(ఎ) https://aprim.ap.gov.in/
(బి) https://aprims.ap.gov.in/
(సి) https://apwrim.ap.gov.in/
(డి) https://apwrims.ap.gov.in/
5. టిబెట్ ఆథ్యాత్మిక గురువుగా ప్రస్తుతం కొనసాగుతున్న ‘లామా టెంజిన్ గ్యాట్సో’ ఎన్నో దలైలామా గా పరిగణించబడుతున్నారు ?
(ఎ) 11
(బి) 12
(సి) 13
(డి) 14
6. భారతదేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ (PM Dhan-Dhaanya Krishi Yojana) ను అమలు చేయాలని నిర్ణయించింది. 2025-26 ఆర్ధిక సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాలు ఈ పథకం అమల్లో ఉంటుంది ?
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9
7. అంతర్జాతీయంగా న్యాయ సంరక్షణకు పిలుపిస్తున్న ‘జస్టిస్ డే’ (World Day for International Justice) ను ఏ తేదీన జరుపుతారు ?
(ఎ) జులై 16
(బి) జులై 17
(సి) జులై 18
(డి) జులై 19
8. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ సన్నాహాలు ప్రారంభించిందని కేంద్ర హోమ్ మంత్రి ‘అమిత్ షా’ తెలిపారు. ఇందుకోసం సుమారు 3,000 మంది క్రీడాకారులకు ఒక్కొక్కరికి నెలకు ఎంత మొత్తం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు ?
(ఎ) రూ. 25,000
(బి) రూ. 50,000
(సి) రూ. 75,000
(డి) రూ. 1,00,000
9. రీడిఫ్యూజన్ (Rediffusion) నివేదిక ప్రకారం … 2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు (BCCI) ఆర్జించిన ఆదాయం ?
(ఎ) రూ. 9,741 కోట్లు
(బి) రూ. 10,741 కోట్లు
(సి) రూ. 11,741 కోట్లు
(డి) రూ. 12,741 కోట్లు
10. హిందుస్థాన్ షిప్ యార్డు నిర్మించిన ‘ఐ ఎన్ ఎస్ నిస్తార్’ (INS Nistar) నౌకను విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో భారత రక్షణ శాఖ సహాయమంత్రి ‘సంజయ్ సేథ్’ ఏ తేదీన జాతికి అంకితం (కమిషనింగ్) చేశారు ?
(ఎ) 2025 జులై 16
(బి) 2025 జులై 17
(సి) 2025 జులై 18
(డి) 2025 జులై 19
GK Bits In Telugu 20 Year 2025 : సరియైన సమాధానాలు
(1) ఎ
వివరణ :
గేదెలు, ఆవులకు పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా చేయడమే ఈ ఇంజెక్షన్ల పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గుజరాత్ లోని ఎన్ డీ డీ బీ (NDDB) సహకారంతో లింగ నిర్ధారిత వీర్యాన్ని అభివృద్ధి చేశారు. ఒక్కో డోస్ కు రూ. 300 వరకు ఖర్చు అవుతుంది. కానీ రైతులకు కేవలం రూ. 150 కే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లింగ నిర్ధారిత వీర్యాన్ని అందిస్తుంది. లింగ నిర్ధారిత వీర్యాన్ని ఇంజెక్షన్ల ద్వారా ఎక్కిస్తే 90% పెయ్య దూడలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది.
2025 జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9,326 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో లింగ నిర్ధారిత వీర్యం పంపిణీని ప్రారంభించారు. ప్రస్తుతం 1.50 లక్షల డోస్ లు సిద్ధంగా ఉన్నాయి. 2026 జనవరి నాటికి మరో 10 లక్షల డోస్ లు అందుబాటులో ఉంటాయి. 2030 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల డోస్ లను వేయడం ద్వారా మేలుజాతి గేదెలు, ఆవుల హబ్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
(2) బి
(3) డి
(4) డి
వివరణ :
అనూహ్య వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కోసారి మేఘ విస్ఫోటం చెంది అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ వ్యవధిలో వాగులు, నదులు పొంగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు … అతి భారీ వర్షాల సమాచారమూ ముందే రాబట్టి, అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ‘వస్సార్ ల్యాబ్స్’ (Vassar Labs) తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి వనరుల నిర్వహణపై జలవనరులశాఖ https://apwrims.ap.gov.in/ అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తోంది. తాజా ప్రాజెక్ట్ లో భాగంగా ఈ వెబ్ సైట్ లో మరిన్ని మార్పులు చేయనున్నారు. రాష్ట్రంలోని 108 జలాశయాలను, 1,000 పెద్ద చెరువుల నిర్వహణను ఈ వెబ్ సైట్ కు అనుసంధానిస్తారు.
(5) డి
వివరణ :
90 సంవత్సరాల వయసున్న టిబెట్ ప్రస్తుత ఆథ్యాత్మిక గురువు ‘లామా టెంజిన్ గ్యాట్సో’ (14వ దలైలామా) తన వారసుడి గురించి మాట్లాడుతూ …. భవిష్యత్తు గురువును (పునర్జన్మ పొందిన బాలుడిని) ‘గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’ మాత్రమే గుర్తిస్తుందని, మరెవరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు.
(6) ఎ
(7) బి
(8) బి
వివరణ :
2036 విశ్వ క్రీడల్లో (Olympics 2036) భారత్ టాప్-5లో నిలవడమే లక్ష్యంగా సాగుతున్నట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 2025 జులై 18న తెలిపారు.
(9) ఎ
వివరణ :
‘రీడిఫ్యూజన్’ నివేదిక ప్రకారం … 2023-24 ఆర్ధిక సంవత్సరంలో BCCI రికార్డు స్థాయిలో రూ. 9,741 కోట్లు ఆదాయం ఆర్జించింది. అందులో సింహభాగం ఐపీల్ (IPL) ద్వారా లభించింది. మొత్తం ఆదాయంలో 59% వాటాతో IPL రూ. 5,761 కోట్లు రాబట్టింది. IPL కాకుండా ఇతర ఈవెంట్ల మీడియా హక్కులతో BCCI కి రూ. 361 కోట్లు వచ్చాయి. భారత జట్టు పాల్గొనే టోర్నీల ద్వారా లభించిన మొత్తమిది. టీమిండియా మ్యాచ్ ల హక్కులు వయాకామ్-18 (Viacom-18) దగ్గర ఉన్నాయి. మీడియా హక్కుల్ని డిస్నీస్టార్, వయాకామ్-18 సొంతం చేసుకున్నాయి.
(10) సి
వివరణ :
జలాంతర్గాములను రక్షించే సామర్థ్యం కలిగి ఉండడం ‘డైవింగ్ సపోర్ట్ వెసల్’ (DSV) అయిన INS Nistar యొక్క ప్రత్యేకత. భారత నౌకాదళాధిపతి ‘అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠీ’ మాట్లాడుతూ … షిప్ యార్డులో తొలి నౌక ‘జల ఉష’ నుంచి ‘INS Nistar’ వరకు చేపట్టిన నిర్మాణాలు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయన్నారు.



