GK Bits In Telugu 21 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 21 Year 2025 : ప్రశ్నలు
1. ఏ రాష్ట్ర గవర్నర్ నివాస భవనం భారతదేశంలోని గవర్నర్ల నివాస భవనాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది ?
(ఎ) మహారాష్ట్ర
(బి) తెలంగాణ
(సి) పశ్చిమబెంగాల్
(డి) గోవా
2. భారతదేశంలోనే తొలిసారిగా పారిశ్రామిక అవసరాల కోసం ‘గ్రీన్ హైడ్రోజన్ – ఎల్ పీ జీ’ కలిపి వినియోగించే ప్రాజెక్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
(ఎ) తిరుపతి
(బి) విశాఖపట్నం
(సి) కాకినాడ
(డి) అమరావతి
3. భర్తతో శృంగారానికి నిరాకరించినా .. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ మానసిక వేదనకు గురిచేసినా విడాకులు ఇచ్చేందుకు ఆ భర్త అర్హుడని ఏ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ?
(ఎ) మద్రాస్ హైకోర్టు
(బి) తెలంగాణ హైకోర్టు
(సి) బాంబే హైకోర్టు
(డి) కోల్ కతా హైకోర్టు
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే పథకం … 2025 ఆగస్ట్ 15 నుండి ప్రారంభమైంది. ఈ పథకానికి ఏ పేరు పెట్టారు ?
(ఎ) స్త్రీశక్తి
(బి) నారీ శక్తి
(సి) మహిళా శక్తి
(డి) అవనీమణి
5. భారత ప్రభుత్వ “ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్” విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు అయిన ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్’ లను విలీనం చేసి నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ పేరు ?
(ఎ) ఆంధ్ర ప్రగతి బ్యాంక్
(బి) ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
(సి) చైతన్య గోదావరి బ్యాంక్
(డి) సప్తగిరి బ్యాంక్
6. భారత బ్యాటర్ ‘హనుమ విహారి’ 2025-26 దేశవాళీ సీజన్ లో ఏ రాష్ట్రం తరపున బరిలో దిగనున్నాడు ?
(ఎ) మణిపూర్
(బి) మేఘాలయ
(సి) నాగాలాండ్
(డి) త్రిపుర
7. ‘చెస్ ప్రపంచకప్ 2025’ (అక్టోబర్ 30 – నవంబర్ 27) ఏ దేశంలో జరుగుతుంది ?
(ఎ) పారిస్ (ఫ్రాన్స్)
(బి) న్యూయార్క్ (అమెరికా)
(సి) గోవా (భారత్)
(డి) షిమ్ కెంట్ (కజకిస్థాన్)
8. మారుతీ సుజుకీ మొట్టమొదటి విద్యుత్ వాహన మోడల్ ‘ఇ-విటారా’ (e VITARA) ఎగుమతులను భారత ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ఏ తేదీన ప్రారంభించారు ?
(ఎ) 2025 ఆగస్ట్ 25
(బి) 2025 ఆగస్ట్ 26
(సి) 2025 ఆగస్ట్ 27
(డి) 2025 ఆగస్ట్ 28
9. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఏ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి ?
(ఎ) 2025 ఆగస్ట్ 25
(బి) 2025 ఆగస్ట్ 26
(సి) 2025 ఆగస్ట్ 27
(డి) 2025 ఆగస్ట్ 28
10. తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రం విశాఖపట్నంలో ‘ఐ ఎన్ ఎస్ ఉదయగిరి, ఐ ఎన్ ఎస్ హిమగిరి’ నౌకలను భారత రక్షణశాఖ మంత్రి ‘రాజ్ నాథ్ సింగ్’ ఏ తేదీన జాతికి అంకితం చేశారు ?
(ఎ) 2025 ఆగస్ట్ 25
(బి) 2025 ఆగస్ట్ 26
(సి) 2025 ఆగస్ట్ 27
(డి) 2025 ఆగస్ట్ 28
GK Bits In Telugu 21 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
వివరణ :
‘గోవా’ రాష్ట్ర గవర్నర్ నివాస భవనం (Goa Rajbhavan) ‘దోనాపౌలా’ లో 88 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 17వ శతాబ్దంలో అరేబియా సముద్రానికి ఎదురుగా కోటను తలపించేలా గోవా రాజ్ భవన్ ను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘కేప్ ప్యాలెస్’ (Cape Palace) అని పిలిచేవారు. భారతదేశంలోని గవర్నర్ల నివాస భవనాలన్నింటిలోనూ ఇదే అత్యుత్తమమైనదిగా పేర్కొంటారు.
(2) ఎ
వివరణ :
భారతదేశంలోనే తొలిసారిగా పారిశ్రామిక అవసరాల కోసం ‘గ్రీన్ హైడ్రోజన్ – ఎల్ పీ జీ’ (Gree Hydrogen – LPG) కలిపి వినియోగించే ప్రాజెక్ట్ ను తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఫెసిలిటీస్ కి చెందిన ‘రాక్ మెన్’ సంస్థ ఏర్పాటు చేస్తోంది.
(3) సి
(4) ఎ
(5) బి
(6) డి
(7) సి
(8) బి
వివరణ :
100 దేశాలకు ‘ఇ-విటారా’ ను మారుతీ సుజుకీ ఎగుమతి చేయనుంది. మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన ‘సుజుకీ మోటార్ గుజరాత్’ (SMG) ప్లాంట్ లో ‘ఇ-విటారా’ ను తయారు చేశారు.
(9) సి
వివరణ :
అమెరికా దేశ కాలమానం ప్రకారం … మంగళవారం (2025 August 26) అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12 : 01 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 : 30 గంటలు) నుంచి భారత్ పై అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడుతుంది.
(10) బి
వివరణ :
ఇండో-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంత రక్షణ బలోపేత చర్యల్లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ జలాల్లో ఈ నౌకలు (INS UDAYGIRI, INS HIMGIRI) బహుముఖ పాత్రను పోషిస్తాయి.



