GK Bits In Telugu 4 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 4 Year 2025 : ప్రశ్నలు
1. ‘ప్రపంచ కాలేయ దినోత్సవం’ ను ఏ తేదీన నిర్వహిస్తారు ?
(ఎ) ఏప్రిల్ 16
(బి) ఏప్రిల్ 17
(సి) ఏప్రిల్ 18
(డి) ఏప్రిల్ 19
2. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లను 2% నుంచి ఎంత శాతానికి పెంచారు ?
(ఎ) 3
(బి) 4
(సి) 5
(డి) 6
3. ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబోల మారథాన్ (Humanoid Robo Marathan) ఏ తేదీన బీజింగ్ (చైనా) లోని ఎకనామిక్-టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియా లో జరిగింది ?
(ఎ) 2025 ఏప్రిల్ 17
(బి) 2025 ఏప్రిల్ 19
(సి) 2025 ఏప్రిల్ 21
(డి) 2025 ఏప్రిల్ 23
4. యాక్సియమ్-4 (ఏఎక్స్-04) మిషన్ లో భాగంగా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు పయనమవుతున్న భారత వ్యోమగామి ?
(ఎ) శుభాంశు శుక్లా
(బి) జితేంద్ర సింగ్
(సి) సి. రామసుబ్రమణియన్
(డి) ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్
5. 2025 ఏప్రిల్ 4న ‘బిమ్ స్టెక్’ (BIMSTEC) ఆరో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ?
(ఎ) దిల్లీ
(బి) ఢాకా
(సి) బ్యాంకాక్
(డి) ఖాట్మండు
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ‘అగ్నిమాపక విభాగం’ ఏర్పాటైంది ?
(ఎ) 1955
(బి) 1956
(సి) 1957
(డి) 1958
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 జనవరి నుంచి ప్రతి నెలా ఎన్నో శనివారం నాడు ‘స్వచ్చాంధ్ర-స్వచ్ఛ దివస్’ ను నిర్వహిస్తున్నారు ?
(ఎ) ఒకటవ
(బి) రెండవ
(సి) మూడవ
(డి) నాల్గవ
8. ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ ను ఏ తేదీన నిర్వహిస్తారు ?
(ఎ) ఏప్రిల్ 16
(బి) ఏప్రిల్ 17
(సి) ఏప్రిల్ 18
(డి) ఏప్రిల్ 19
9. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ?
(ఎ) మణిపుర్
(బి) ఉత్తర్ ప్రదేశ్
(సి) సిక్కిం
(డి) గుజరాత్
10. ‘ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా’ (Organic State of India) అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ?
(ఎ) మణిపుర్
(బి) సిక్కిం
(సి) మిజోరాం
(డి) పశ్చిమ బెంగాల్
GK Bits In Telugu 4 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
(2) ఎ
(3) బి
వివరణ :
21 కి.మీ. దూరం కొనసాగిన మారథాన్ లో ట్రాక్ పై 21 రోబోలు … క్రీడాకారులతో పోటీపడ్డాయి.
(4) ఎ
వివరణ :
నాలుగు దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసిలోకి వెళ్లడం ఇదే మొదటిసారి. శుభాంశు శుక్లా భారత వైమానిక దళంలో టెస్ట్ పైలట్ గా వ్యవహరించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా కూడా ఉన్నారు.
ఏదైనా కారణం వలన ఈ యాత్రలో శుభాంసు శుక్లా పాలుపంచుకోలేకపోతే … ఆయన స్థానాన్ని భారత్ కు చెందిన మరో వ్యోమగామి ‘ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్’ భర్తీ చేస్తారు.
(5) సి
వివరణ :
1997లో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ లతో ‘బిమ్ స్టెక్’ ఏర్పడింది.
(6) సి
ఎస్ ఎఫ్ ఏ సీ (SFAC) ప్రమాణాల ప్రకారం … పట్టణాల్లో 10 కిలోమీటర్లకు ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఫైర్ స్టేషన్ ఉండాలి. అయితే, అవి పట్టణాల్లో 16-144 కి.మీ., గ్రామాల్లో 144-1,480 కి.మీ. పరిధిలో ఏర్పాటయ్యాయి.
(7) సి
(8) సి
వివరణ :
భారతీయ సంస్కృతి, వారసత్వ ప్రతీకైన భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు అరుదైన గౌరవం లభించింది. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే UNESCO Memory of World Register లో వీటికి చోటు దక్కింది. భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యూమెంటరీలను గుర్తించినట్లు యునెస్కో పేర్కొంది. దీంతో మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది.
(9) ఎ
వివరణ :
భారతదేశంలో ‘ఘజియాబాద్’ (ఉత్తర్ ప్రదేశ్) లోని National Center for Organic Farming ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
(10) బి