GK Bits In Telugu 5 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 5 Year 2025 : ప్రశ్నలు
1. భారతదేశం సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది ?
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9
2. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ?
(ఎ) సర్ ఆల్బర్ట్ హోవార్డ్
(బి) ఎం.ఎస్. స్వామినాథన్
(సి) సుభాష్ పాలేకర్
(డి) సర్ ఆర్థర్ కాటన్
3. భారతదేశంలో ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
(ఎ) 2015
(బి) 2016
(సి) 2017
(డి) 2018
4. భారతదేశానికి ఏ దేశం నుంచి పసిడి అధికంగా దిగుమతి అవుతోంది ?
(ఎ) యూఏఈ
(బి) సింగపూర్
(సి) దక్షిణాఫ్రికా
(డి) అమెరికా
5. సీబీడీటీ (CBDT) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) అరవింద్ శ్రీవాస్తవ
(బి) రవి అగర్వాల్
(సి) ప్రబోధ్ సేథ్
(డి) రమేశ్ నారాయన్ పర్భాత్
6. ఏ రాష్ట్రంలో కొత్త అంతరిక్ష పార్కును ఇస్రో (ISRO) ఏర్పాటు చేయనుంది ?
(ఎ) కేరళ
(బి) తమిళనాడు
(సి) ఆంధ్రప్రదేశ్
(డి) ఒడిశా
7. లిక్విడ్ ఆక్సిజన్ మీథేన్ ఉపయోగించి ఏ సంవత్సరంలో చంద్రుడి పైకి మార్క్-3 రాకెట్ పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ?
(ఎ) 2026
(బి) 2027
(సి) 2028
(డి) 2029
8. భారతదేశంలో ‘సివిల్ సర్వీసెస్ డే’ (Civil Services Day) ను ఏ తేదీన నిర్వహిస్తారు ?
(ఎ) ఏప్రిల్ 18
(బి) ఏప్రిల్ 19
(సి) ఏప్రిల్ 20
(డి) ఏప్రిల్ 21
9. ‘ది టాకింగ్ గన్స్ : నార్త్ ఈస్ట్ ఇండియా’ (The Talking Guns : North East India) పుస్తక రచయిత ?
(ఎ) వి.వి. లక్ష్మీనారాయణ
(బి) అజిత్ డోభాల్
(సి) నీరేంద్ర దేవ్
(డి) విక్రం మిస్త్రీ
10. భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఈ సంవత్సరంలో ఏ నెల నుంచి పరుగులు తీయనుంది ?
(ఎ) జూన్
(బి) జులై
(సి) ఆగస్టు
(డి) సెప్టెంబర్
GK Bits In Telugu 5 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
(2) ఎ
(3) ఎ
వివరణ :
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్ తో అనుసంధానించడం అనేది ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని కింద సేంద్రియ సాగు చేపట్టేందుకు రైతు సమాఖ్యలు ఏర్పడ్డాయి.
(4) బి
వివరణ :
మొత్తం బంగారం దిగుమతుల్లో సింగపూర్ దేశ వాటా 40%. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో మనదేశంలో మొత్తం పసిడి దిగుమతులు 58 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల కోట్లు) కు చేరాయి. పరిమాణం పరంగా చూస్తే … 2024-25లో 757.15 టన్నుల పసిడి అధికారికంగా దిగుమతి అయ్యింది. మనదేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 8% గా ఉంది.
(5) బి
(6) బి
వివరణ :
తమిళనాడులోని కన్యాకుమారిలో కొత్త అంతరిక్ష పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ ‘నారాయణన్’ తెలిపారు.
(7) బి
వివరణ :
మార్క్-3 రాకెట్ ద్వారా 4,000 కిలోల బరువైన ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపవచ్చు.
(8) డి
(9) సి
(10) బి
వివరణ :
2025 జులై నెలలో హరియాణా లోని జింద్ నుంచి సోనీపత్ మధ్య హైడ్రోజన్ రైలు నడవనుంది. చెన్నై లో తయారు చేస్తున్న ఈ రైలు పనులు తుది దశలో ఉన్నాయి.