GK Bits In Telugu 7 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 7 Year 2025 : ప్రశ్నలు
1. 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి జీడీపీ (GDP) లో కేంద్ర ప్రభుత్వ రుణాల శాతం ?
(ఎ) 38.1%
(బి) 48.1%
(సి) 58.1%
(డి) 68.1%
2. రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన హ్యాండ్ బ్యాగ్ లు, చేతివాచీలు, పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్ వంటి విలాస వస్తువులపై ఎంత శాతం ‘మూలం వద్ద పన్ను’ (TCS) వసూలు చేయనున్నట్లు ఆదాయపు పన్ను (IT) విభాగం ప్రకటించింది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
3. 2025 ఏప్రిల్ 23న ‘ఫిడే మహిళల గ్రాండ్ ప్రి’ టైటిల్ ను గెలిచిన విజేత ?
(ఎ) దివ్య దేశ్ ముఖ్
(బి) సలిమోవా
(సి) కోనేరు హంపి
(డి) జు జినర్
4. క్యాథలిక్కుల అత్యున్నత గురువు ‘పోప్ ఫ్రాన్సిస్’ (Pope Francis) ఏ తేదీన కన్నుమూశారు ?
(ఎ) 2025 ఏప్రిల్ 21
(బి) 2025 ఏప్రిల్ 22
(సి) 2025 ఏప్రిల్ 23
(డి) 2025 ఏప్రిల్ 24
5. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం 2025 ఏప్రిల్ 21న భారత్ కు వచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ ?
(ఎ) ఉషా వాన్స్
(బి) జె.డి. వాన్స్
(సి) కమలా హారిస్
(డి) ఎలాన్ మస్క్
6. ‘ధరిత్రీ దినోత్సవం’ (Earth Day) ను ఏ తేదీన జరుపుతారు ?
(ఎ) ఏప్రిల్ 21
(బి) ఏప్రిల్ 22
(సి) ఏప్రిల్ 23
(డి) ఏప్రిల్ 24
7. ఏ తేదీ నుంచి పదేళ్ల వయసు మించిన పిల్లలు బ్యాంకు ఖాతాలను సొంతంగా నిర్వహించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది ?
(ఎ) 2025 జూన్ 1
(బి) 2025 జులై 1
(సి) 2025 ఆగస్ట్ 1
(డి) 2025 సెప్టెంబర్ 1
8. ‘మైండ్ సెట్ షిఫ్ట్’ (Mind Set Shift) పుస్తక రచయిత పేరు ?
(ఎ) చిరంజీవి
(బి) గంటా శ్రీనివాసరావు
(సి) వెరోనిక దస్సనాయక
(డి) పొంగూరు శరణి
9. విద్యార్థినితో గుంజీలు తీయించిన ఉపాధ్యాయినికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ ఏ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తమిళనాడు
(సి) కర్ణాటక
(డి) కేరళ
10. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎవరిని నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ 2025 ఏప్రిల్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు ?
(ఎ) డాక్టర్ జి. సతీష్ రెడ్డి
(బి) డాక్టర్ ఎస్. సోమనాథ్
(సి) సీ ఎస్ ఆర్ కే ప్రసాద్
(డి) పి. చంద్రశేఖర్
GK Bits In Telugu 7 Year 2025 : సరియైన సమాధానాలు
(1) సి
(2) ఎ
వివరణ :
1% TCS వర్తించే విలాస వస్తువుల జాబితాను IT విభాగం 2025 ఏప్రిల్ 22న నోటిఫై చేసింది. అవి :
- చేతివాచీలు
- పెయింటింగ్ లు
- శిల్పాలు
- పురాతన వస్తువులు
- నాణేలు
- స్టాంపులు
- పడవలు
- హెలికాప్టర్ లు
- హ్యాండ్ బ్యాగ్ లు
- సన్ గ్లాసెస్
- హై-ఎండ్ స్పోర్ట్ వేర్ పరికరాలు
- హోమ్ థియేటర్ సిస్టమ్స్
- పోటీల కోసం సిద్ధం చేసిన గుర్రాలు
పైన తెలియజేసిన వస్తువుల కొనుగోలు సమయంలో కొనుగోలుదారు నుంచి 1% టీసీఎస్ వసూలు చేస్తారు. వీటిని ఐటీ రిటర్న్ ల సమయంలో సంబంధితులు సర్దుబాటు చేసుకోవచ్చు.
2025 జనవరి 1 నుంచి రూ. 10 లక్షల పైబడిన మోటార్ వాహనాలపై 1% TCS వసూలు చేస్తున్నారు.
(3) సి
వివరణ :
2025 ఏప్రిల్ 23న చివరిదైన 9వ రౌండ్ లో ‘సలిమోవా’ (బల్గెరియా) పై గెలిచి ‘కోనేరు హంపి’ ఏడు పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. ‘పోలినా’ (రష్యా) ను ఓడించిన ‘జు జినర్’ (చైనా) కూడా 7 పాయింట్లతో నిలిచింది. కానీ మెరుగైన టైబ్రేక్స్ స్కోర్ ఆధారంగా హంపి విజేతగా నిలిచింది.
37 ఏళ్ల హంపి గత ఏడాది డిసెంబర్ లో ‘ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్’ ను కూడా గెలుచుకుంది.
(4) ఎ
వివరణ :
ఇటలీ కాలమానం ప్రకారం 2025 ఏప్రిల్ 21 ఉదయం 7.35 గంటలకు ‘పోప్ ఫ్రాన్సిస్’ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పోప్ నకు కామెర్లెంగో (Camerlengo) గా వ్యవహరిస్తున్న ‘కెవిన్ ఫారెల్’ ప్రకటించారు.
(5) బి
(6) బి
వివరణ :
పారిశ్రామిక, మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి వనరులపై అంతకంతకు ఒత్తిడి పెరుగుతోంది. విపత్తులు, విధ్వంసం కారణంగా సహజ వనరులు తరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పును మోసుకొస్తాయని గ్రహించిన పర్యావరణవేత్తలు ‘గేలోర్డ్ నెల్సన్, డెనిస్ హేస్’ ప్రకృతి సంరక్షణ కోసం ఉద్యమం నిర్మించారు. ఆ స్ఫూర్తి తోనే 1970లో మొదటిసారిగా అమెరికాలో ‘ధరిత్రీ దినోత్సవం’ నిర్వహించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు దీన్ని జరుపుతున్నాయి.
ఈ సంవత్సరం ‘మన ఇంధనం-మన భూగోళం’ (Mana Indhanam-Mana Bhugolam) అనే నినాదంతో పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు.
(7) బి
(8) డి
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు ‘పొంగూరు శరణి’ (Ponguru Sarani) రచించిన “మైండ్ సెట్ షిఫ్ట్” పుస్తకాన్ని 2025 ఏప్రిల్ 24న విజయవాడలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు.
(9) బి
వివరణ :
తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుమానగర్ కి చెందిన పాండిసెల్వి కుమార్తె స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆమె హోమ్ వర్క్ చేయలేదని తమిళ ఉపాధ్యాయిని ‘చిత్ర’ ఒకరోజు 200, మరుసటి రోజు 400 గుంజీలు తీయించారు. దీంతో బాలిక స్పృహ కోల్పోయింది.
(10) డి
వివరణ :
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా హృద్రోగ నిపుణులు ‘డాక్టర్ పూలాల చంద్రశేఖర్’ నియమితులయ్యారు. ఇతను ఈ పదవిలో 3 సంవత్సరాలు ఉంటారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన చంద్రశేఖర్ 38 ఏళ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
హృద్రోగ నిపుణుడిగా డాక్టర్ చంద్రశేఖర్ అందించిన సేవలకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) 2023లో ‘Certificate of Commitment’ ను ప్రదానం చేసింది.