GK Bits In Telugu 8 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 8 Year 2025 : ప్రశ్నలు
1. ‘భారత్ ఎన్ క్యాప్‘ (Bharat NCAP) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
(ఎ) 2021
(బి) 2022
(సి) 2023
(డి) 2024
2. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మనదేశంలోనే తిష్టవేసిన పాకిస్థానీయులను ‘Immigration & Foreigners Act – 2025’ ప్రకారం అరెస్టు చేస్తామని మనదేశ అధికారులు హెచ్చరించారు. ఈ యాక్ట్ ను ఉల్లంఘించిన వారు ఎలాంటి శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ?
(ఎ) ఒక సంవత్సరం వరకూ జైలు శిక్ష లేదా గరిష్ఠంగా రూ. 1 లక్ష జరిమానా లేదా రెండు శిక్షలు
(బి) రెండు సంవత్సరాల వరకూ జైలు శిక్ష లేదా గరిష్ఠంగా రూ. 2 లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు
(సి) మూడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష లేదా గరిష్ఠంగా రూ. 3 లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు
(డి) నాలుగు సంవత్సరాల వరకూ జైలు శిక్ష లేదా గరిష్ఠంగా రూ. 4 లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు
3. ఏ దేశ యువరాజు (అల్-వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్) గత 20 సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నారు ?
(ఎ) సౌదీ అరేబియా
(బి) ఖతార్
(సి) కువైట్
(డి) యూఏఈ
4. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో ‘మత్స్యకారుల సేవలో’ అనే పథకాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు’ ఏ తేదీన ప్రారంభించారు ?
(ఎ) 2025 ఏప్రిల్ 26
(బి) 2025 ఏప్రిల్ 27
(సి) 2025 ఏప్రిల్ 28
(డి) 2025 ఏప్రిల్ 29
5. టిబెట్ లోని కైలాస్ శ్రేణిలో మానస సరోవరం సమీపంలో ఎన్ని మీటర్ల ఎత్తులో సింధు నది ఉద్భవించింది ?
(ఎ) 2,164
(బి) 3,164
(సి) 4,164
(డి) 5,164
6. భారత్ ఏ సంవత్సరంలో ‘కిషన్ గంగా’ ప్రాజెక్టును ప్రారంభించింది ?
(ఎ) 2006
(బి) 2007
(సి) 2008
(డి) 2009
7. భారత నూతన పార్లమెంటు భవనంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ఏ తేదీన ఆవిష్కరించారు ?
(ఎ) 2022 జులై 11
(బి) 2022 జులై 12
(సి) 2022 జులై 13
(డి) 2022 జులై 14
8. ఇటీవల భారత రాష్ట్రపతి భవన్ లో గల ‘దర్బార్ హాల్’ ను ఏ పేరుతో మార్పు చేశారు ?
(ఎ) దర్బార్ మండపం
(బి) అశోక్ మండపం
(సి) భారత్ మండపం
(డి) గణతంత్ర మండపం
9. ఏ సంవత్సరంలో మొగల్ గార్డెన్స్ (రాష్ట్రపతి భవన్) పేరును ‘అమృత ఉద్యాన్’ గా మార్పు చేశారు ?
(ఎ) 2021
(బి) 2022
(సి) 2023
(డి) 2024
10. జాతీయ జంతువుగా ‘పులి’ ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఎంపిక చేసింది ?
(ఎ) 1970
(బి) 1971
(సి) 1972
(డి) 1973
GK Bits In Telugu 8 Year 2025 : సరియైన సమాధానాలు
(1) సి
వివరణ :
కార్ల భద్రతను క్రాష్ పరీక్షల ద్వారా మదింపు చేసి స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘భారత్ ఎన్ క్యాప్’ (New Car Safety Assessment Program) పథకాన్ని 2023వ సంవత్సరంలో నితిన్ గడ్కరీ ప్రారంభించారు. 3.5 టన్నుల బరువు ఉండే మోటార్ వాహనాల రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.
(2) సి
(3) ఎ
వివరణ :
సౌదీ యువరాజు ‘అల్-వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్’ 2005లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అప్పటి నుంచి కోమాలో ఉన్నారు. రియాద్ లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజీ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ట్యూబు ద్వారా ఆహారం పంపుతారు. ఇతనిని Sleeping Prince అని పిలుస్తారు.
(4) ఎ
వివరణ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘మత్స్యకారుల సేవలో’ (Matsyakarula Sevalo) అనే పథకం ద్వారా వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ. 20,000 భృతిగా ఇస్తారు. ఇంతకుముందు ఈ భృతి రూ. 10,000 గా ఉండేది.
(5) సి
(6) బి
(7) ఎ
వివరణ :
నూతన పార్లమెంట్ భవనంపై ఆవిష్కరింపబడిన జాతీయ చిహ్నాన్ని ‘సునీల్ దేవ్ రే’ (ఔరంగాబాద్), ‘లక్ష్మణ్ వ్యాస్’ (జైపుర్) రూపొందించారు. 9,500 కేజీల బరువు, 6.5 మీటర్ల ఎత్తు గల ఈ చిహ్నాన్ని కంచుతో తయారు చేశారు.
(8) డి
(9) సి
(10) డి
వివరణ :
సింహాన్ని భారత జాతీయ జంతువుగా 1972 వరకు గుర్తించారు.