GK Bits In Telugu 9 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 9 Year 2025 : ప్రశ్నలు
1. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2025-26) లో వివిధ రంగాలకు ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది ?
(ఎ) రూ. 4.60 లక్షల కోట్లు
(బి) రూ. 5.60 లక్షల కోట్లు
(సి) రూ. 6.60 లక్షల కోట్లు
(డి) రూ. 7.60 లక్షల కోట్లు
2. భారత ప్రస్తుత త్రిదళాధిపతి (CDS) ?
(ఎ) అజిత్ డోభాల్
(బి) అనిల్ చౌహాన్
(సి) ఉపేంద్ర ద్వివేది
(డి) దినేష్ కె. త్రిపాఠీ
3. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా ఎన్ని చదరపు గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ?
(ఎ) 150
(బి) 250
(సి) 350
(డి) 450
4. ప్రజల భద్రత కోసం ఏ నగరంలో ‘రెడ్ బటన్ రోబోటిక్ కాప్’ వచ్చే జూన్ నెలలో అందుబాటులోకి రానుంది ?
(ఎ) దిల్లీ
(బి) కోల్ కతా
(సి) ముంబయి
(డి) చెన్నై
5. ‘జాతీయ డ్యాం భద్రత అథారిటీ’ (NDSA) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) అనిల్ జైన్
(బి) రాకేశ్ కశ్యప్
(సి) ప్రభాత్ కుమార్
(డి) కబీర్ బాషా
6. తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఎన్నవ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన ‘దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ’ 2025 ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించారు ?
(ఎ) 71
(బి) 72
(సి) 73
(డి) 74
7. ఏ జీవిని ‘భారత జాతీయ వారసత్వ జంతువు’ గా పరిగణిస్తారు ?
(ఎ) పులి
(బి) సింహం
(సి) ఏనుగు
(డి) నీటిగుర్రం
8. ‘జనగణమన’ గీతాన్ని మొదటగా ఏ భాషలో స్వరపరిచారు ?
(ఎ) హిందీ
(బి) బెంగాలీ
(సి) తెలుగు
(డి) మరాఠీ
9. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా ఎన్ని సెకన్ల సమయం పడుతుంది ?
(ఎ) 42
(బి) 47
(సి) 52
(డి) 57
10. నూతన పార్లమెంటు భవనాన్ని భారత ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ఏ తేదీన ప్రారంభించారు ?
(ఎ) 2023, మే 25
(బి) 2023, మే 26
(సి) 2023, మే 27
(డి) 2023, మే 28
GK Bits In Telugu 9 Year 2025 : సరియైన సమాధానాలు
(1) సి
వివరణ :
సచివాలయంలో 2025 ఏప్రిల్ 29న జరిగిన 231వ SLBC సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
(2) బి
(3) ఎ
వివరణ :
151 నుంచి 300 గజాల వరకు రిజిస్ట్రేషన్ బేసిక్ విలువలో 15%, రిజిస్ట్రేషన్ ఫీజులో 50% ప్రజలు చెల్లించవలసి ఉంటుంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 301 నుంచి 451 గజాల వరకు దస్తావేజుల రిజిస్ట్రేషన్ పరంగా చెల్లించాల్సిన ఫీజులు, ఇతర వివరాలను ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరించారు.
(4) డి
వివరణ :
చెన్నై నగరంలో 2025 జూన్ నుంచి 200 చోట్ల పోలీసు రోబో (Red Button Robotic Cop) లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సాయంతో పనిచేసే ఈ రోబోలు 24 గంటల పాటు 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షిస్తాయి. జనసంచారాన్ని వీడియో తీయడంతో పాటు, వాయిస్ రికార్డు కూడా చేస్తాయి.
(5) ఎ
(6) ఎ
(7) సి
(8) బి
(9) సి
(10) డి