GK Test : 3 ; Year : 2026 – GK Bits Telugu

By Gk Bits Telugu

Published On:

Join WhatsApp

Join Now

ప్రశ్నలు

(1) గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా భారత ప్రభుత్వం “కంప్యూటర్ దీదీ -దీదీకా దుకాణ్” (Computer Didi – Didika Dukan) పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు ?

(ఎ) 1

(బి) 3

(సి) 5

(డి) 7

(2) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత ?

(ఎ) ఎలెనా రిబకినా (కజకిస్థాన్)

(బి) అరీనా సబలెంకా (బెలారస్)

(సి) ఇగా స్వైటెక్ (పోలెండ్)

(డి) జెస్సికా పెగులా (అమెరికా)

(3) 2026 ఫిబ్రవరి 1న భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 విలువ ?

(ఎ) రూ. 51,47,315 కోట్లు

(బి) రూ. 52,47,315 కోట్లు

(సి) రూ. 53,47,315 కోట్లు

(డి) రూ. 54,47,315 కోట్లు

(4) 2026-27 కేంద్ర బడ్జెట్ లో మూలధన వ్యయం కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు ?

(ఎ) రూ. 11.22 లక్షల కోట్లు

(బి) రూ. 12.22 లక్షల కోట్లు

(సి) రూ. 13.22 లక్షల కోట్లు

(డి) రూ. 14.22 లక్షల కోట్లు

(5) 2026-27 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్ళేవి ఎన్ని ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4

(6) 2026-27 కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్ట్ కు ఎంత మొత్తాన్ని కేటాయించారు ?

(ఎ) రూ. 1,320.39 కోట్లు

(బి) రూ. 2,320.39 కోట్లు

(సి) రూ. 3,320.39 కోట్లు

(డి) రూ. 4,320.39 కోట్లు

(7) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 10 లక్షల నుంచి 40 లక్షల లోపు జనాభా ఉన్న ఎన్ని నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 16వ ఆర్ధిక సంఘం రూ. 56,100 కోట్లు కేటాయించింది ?

(ఎ) 21

(బి) 22

(సి) 23

(డి) 24

(8) 2026-27 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఏ కారిడార్ ను సరకు రవాణాకు ప్రత్యేకంగా కేటాయించారు ?

(ఎ) డాంకునీ-సూరత్

(బి) వారణాసి-సిలీగుడీ

(సి) దిల్లీ-వారణాసి

(డి) హైదరాబాద్-చెన్నై

(9) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన “వీబీ-జీ రామ్ జీ” (VB-G RAM G) పథకానికి 2026-27 కేంద్ర బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని కేటాయించారు ?

(ఎ) రూ. 91,692 కోట్లు

(బి) రూ. 93,692 కోట్లు

(సి) రూ. 95,692 కోట్లు

(డి) రూ. 97,692 కోట్లు

(10) 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రకారం … క్లస్టర్ స్థాయిలో ‘షీమార్ట్’ (SheMart) ల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 670కి పైగా మండలాల్లో ఒక్కోదానికి ఎంత మొత్తం మేర కేంద్ర గ్రాంట్ అందుతుంది ?

(ఎ) రూ.10 లక్షలు

(బి) రూ.20 లక్షలు

(సి) రూ.30 లక్షలు

(డి) రూ.40 లక్షలు

సమాధానాలు

(1) సి

వివరణ :

పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ‘తాడికొండ’ మండలం కూడా ఉంది.

(2) ఎ

వివరణ :

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ ను కజకిస్థాన్ దేశానికి చెందిన “ఎలెనా రిబకినా” గెలుచుకుంది. 2026 జనవరి 31న జరిగిన ఫైనల్లో 5వ సీడ్ రిబకినా 6-4, 4-6, 6-4 స్కోర్ తేడాతో టాప్ సీడ్ ‘అరీనా సబలెంకా’ (బెలారస్) పై విజయం సాధించింది. రిబకినా కు కెరీర్ లో ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. 2022 (వింబుల్డన్) లో ఆమె తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుంది.

(3) సి

వివరణ :

“వృద్ధికి ఊతమివ్వడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రగతిపథంలో అందరినీ కలుపుకొని వెళ్లడం” అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ 2026-27 కేంద్ర బడ్జెట్ ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

(4) బి

(5) సి

వివరణ :

2026-27 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా మూడు కారిడార్లు వెళ్తాయి. అవి :

  • హైదరాబాద్-బెంగళూరు
  • హైదరాబాద్-చెన్నై
  • చెన్నై-బెంగళూరు

ఈ మూడు కారిడార్ల మొత్తం పొడవు 1,671 కి.మీ. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 857 కి.మీ. గా ఉండనుంది.

(6) సి

వివరణ :

2025-26 కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్ట్ కు రూ. 5,936 కోట్లు కేటాయించినా … అంచనాల సవరణలో రూ. 3,017.20 కోట్లకు తగ్గింది.

(7) బి

వివరణ :

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 10 లక్షల నుంచి 40 లక్షల లోపు జనాభా ఉన్న 22 నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 16వ ఆర్ధిక సంఘం రూ. 56,100 కోట్లు కేటాయించింది. అవి :

  1. పుణె
  2. జైపుర్
  3. లఖ్ నవూ
  4. కాన్పూర్
  5. నాగ్ పుర్
  6. ఇందౌర్
  7. భోపాల్
  8. విశాఖపట్నం
  9. పట్నా
  10. వడోదర
  11. లూథియానా
  12. ఫరీదాబాద్
  13. రాజ్ కోట్
  14. ధన్ బాద్
  15. అమృత్ సర్
  16. హౌడా
  17. రాంచి
  18. కోయంబత్తూరు
  19. విజయవాడ
  20. జోధ్ పుర్
  21. మదురై
  22. రాయ్ పుర్

(8) ఎ

వివరణ :

2026-27 కేంద్ర బడ్జెట్ లో మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అవి :

  1. ముంబయి-పుణె
  2. పుణె-హైదరాబాద్
  3. హైదరాబాద్-బెంగళూరు
  4. హైదరాబాద్-చెన్నై
  5. దిల్లీ-వారణాసి
  6. వారణాసి-సిలీగుడీ
  7. డాంకునీ (పశ్చిమబెంగాల్)-సూరత్ (గుజరాత్)

పైవాటిలో డాంకునీ (పశ్చిమబెంగాల్)-సూరత్ (గుజరాత్) కారిడార్ ను సరకు రవాణాకు ప్రత్యేకంగా కేటాయిస్తారు.

(9) సి

(10) బి

వివరణ :

స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యురాళ్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం “షీమార్ట్” లను ఏర్పాటు చేస్తామని 2026-27 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

🔴Related Post

Leave a Comment