GK Test : 4 ; Year : 2026 – GK Bits Telugu

By Gk Bits Telugu

Published On:

Join WhatsApp

Join Now

ప్రశ్నలు

(1) “వరల్డ్ క్యాన్సర్ డే” (World Cancer Day) ను ఏ తేదీన జరుపుతారు ?

(ఎ) ఫిబ్రవరి 1

(బి) ఫిబ్రవరి 2

(సి) ఫిబ్రవరి 3

(డి) ఫిబ్రవరి 4

(2) స్టార్ట్అప్ ల సంఖ్యలో భారత్ నేడు ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4

(3) రోడ్డు ప్రమాద బాధితులను తొలి గంట (Golden Hour) లో ఆసుపత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడిన వారికి ఎంత మొత్తం చొప్పున ఆర్ధిక సాయం అందించేలా కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వశాఖ (MORTH) “రహ్-వీర్” (Rah-Veer) పథకాన్ని అమలు చేస్తోంది ?

(ఎ) రూ.10,000

(బి) రూ.25,000

(సి) రూ.50,000

(డి) రూ.75,000

(4) ఒక మహిళ స్థాపించి, నాయకత్వం వహించిన అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీని చెబుతారు ?

(ఎ) అడోబ్

(బి) పెప్సీ

(సి) హోండా

(డి) కాన్వా

(5) ప్రస్తుత ధరల ప్రకారం ఐసీసీ ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ద్వారా దాదాపు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ?

(ఎ) రూ. 1,200 కోట్లు

(బి) రూ. 2,200 కోట్లు

(సి) రూ. 3,200 కోట్లు

(డి) రూ. 4,200 కోట్లు

(6) 2016 నాటి పాత నిబంధనల స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన “బ్యాగేజీ నిబంధనలు-2026” ప్రకారం విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గంలో మనదేశం వచ్చే మహిళా ప్రయాణీకులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఈ నిబంధనలు ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి ?

(ఎ) 2026 ఫిబ్రవరి 1

(బి) 2026 ఫిబ్రవరి 2

(సి) 2026 ఫిబ్రవరి 3

(డి) 2026 ఫిబ్రవరి 4

(7) ఏ రాష్ట్రం “బ్యాసిలస్ సబ్టిలస్” అనే బ్యాక్టీరియంను తమ ‘రాష్ట్ర సూక్ష్మజీవి’ గా ప్రకటించింది ?

(ఎ) కేరళ

(బి) కర్ణాటక

(సి) తమిళనాడు

(డి) ఆంధ్రప్రదేశ్

(8) “ల్యాక్టోబ్యాసిలస్ బల్గేరికస్” ను తమ జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించిన దేశం ?

(ఎ) భారత్

(బి) పాకిస్తాన్

(సి) శ్రీలంక

(డి) చైనా

(9) ప్రముఖ బౌద్ధ గురువు ‘దలైలామా’ కు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్ : ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్ కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్ ఆథ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇది ఎన్నోసారి ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4

(10) 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రకారం భారత్ లో నెలకొల్పిన డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయంగా సేవలందించే విదేశీ కంపెనీలకు ఏ సంవత్సరం వరకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు ?

(ఎ) 2045

(బి) 2046

(సి) 2047

(డి) 2048

సమాధానాలు

(1) డి

(2) సి

వివరణ :

స్టార్ట్అప్ ల సంఖ్యలో భారత్ నేడు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇండియాలో నేడు సాధికారంగా గుర్తింపు పొందిన స్టార్ట్ అప్ ల సంఖ్య 1,80,000 కు పైగానే ఉంది. వాటిలో 120 యునికార్న్ హోదా సాధించాయి.

(3) బి

వివరణ :

రోడ్డు ప్రమాద బాధితులను తొలి గంటలో ఆసుపత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడిన వారికి రూ.25,000 చొప్పున ఆర్ధిక సాయం అందించేలా కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వశాఖ “రహ్-వీర్” పథకాన్ని అమలు చేస్తోంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. భారతదేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, వాటిలో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో …. ఈ బాధితులను కాపాడేలా సామాన్య ప్రజలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో బాధితుడిని తక్షణం ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చేసి ప్రాణాలు కాపాడే వారికి ‘రహ్-వీర్’ పథకం వర్తిస్తుంది. వారికి రూ. 25,000 చొప్పున ఆర్థికసాయంతోపాటు, ప్రశంసాపత్రం అందిస్తారు.

జాతీయస్థాయిలో కూడా ఏటా 10 మంది రహ్-వీర్ లను ఎంపిక చేసి, వారికి రూ. 1,00,000 చొప్పున ఆర్థికసాయం, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు.

(4) డి

వివరణ :

ఆస్ట్రేలియాకు చెందిన “మెలానీ పెర్కిన్స్” 2013లో సిడ్నీ కేంద్రంగా ‘కాన్వా’ (CANVA) ను ప్రారంభించారు. రూ. 20 లక్షల కోట్ల గ్లోబల్ క్రియేటివ్ సాఫ్ట్ వేర్ మార్కెట్ లో ప్రస్తుతం CANVA కు 12% వాటా ఉంది.

(5) బి

వివరణ :

ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా కారణం వలన భారత్, పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగకపోతే ప్రసారదారునికి రూ. 200-250 కోట్ల నష్టం వస్తుంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో 10 సెకన్ల ఒక ప్రకటన (Advertisement) కు రూ. 40 లక్షల వరకు ఆదాయం వస్తుంది.

(6) బి

వివరణ :

ఈ ఆభరణాలు కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు ఉండదు. ఇప్పటివరకు మహిళలు రూ. 1,00,000 , పురుషులు రూ. 50,000 విలువైన ఆభరణాలు మాత్రమే తీసుకురావడానికి వీలయ్యేది.

(7) ఎ

వివరణ :

కేరళ రాష్ట్రం “బ్యాసిలస్ సబ్టిలస్” అనే బ్యాక్టీరియంను తమ ‘రాష్ట్ర సూక్ష్మజీవి’ గా ప్రకటించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ చర్యను చేపట్టింది. భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో సూక్ష్మజీవుల పాత్రపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను సమాజహితానికి అందుబాటులోకి తీసుకురావడానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ మైక్రోబయోమ్’ (CoEM) ను కూడా ప్రారంభించింది.

(8) ఎ

(9) ఎ

వివరణ :

90 ఏళ్ల టిబెట్ ఆథ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇది తొలిసారి. దలైలామా తరపున గాయకుడు ‘రపూస్ వెయిన్ రైట్’ ఈ అవార్డును స్వీకరించారు. ‘ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్’ కేటగిరీలో ఈ అవార్డు దక్కింది.

గాయకులు మ్యాగీ రోజర్స్, ఆండ్రా డే తో కలిసి దలైలామా ఈ ఆల్బం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. కబీర్ సెహగల్ నిర్మించిన ఈ ఆల్బం లో సరోద్ విద్వాంసుడు అంజాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, అమెరికా శాక్సాఫోన్ విద్వాంసుడు టెడ్ నాష్, గాయకుడు, గేయ రచయిత డెబీ నోవా తదితరులు కనిపించారు.

(10) సి

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

🔴Related Post

Leave a Comment