మనకు అప్పుడప్పుడు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్ల వివరాలను ఈక్రింద ఇవ్వడం జరిగింది. (Important Web Links)
(1) naipunyam.ap.gov.in
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తమ వివరాలను naipunyam.ap.gov.in అనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోవలెను. ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న తరవాత ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ ఉద్యోగమేళా (AP Jobmela) లకు హాజరు అయ్యేటప్పుడు ఈ రిఫరెన్స్ నెంబర్ తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలను తీసుకుని ఇంటర్వ్యూ లలో పాల్గొనవలసి ఉంటుంది.
(2) ” పీఎం విద్యాలక్ష్మి ” పథకం
‘పీఎం విద్యాలక్ష్మి’ (PM Vidyalaxmi) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఈ పథకం పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
(3) “ఈపీఎఫ్ఓ” సేవలన్నీ ఒకే వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు
ఇకనుంచి ‘ఈపీఎఫ్ఓ” (EPFO) సేవలన్నీ ఒకే లాగ్ ఇన్ ద్వారా పొందవచ్చు. ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న లాగ్ ఇన్ లను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ‘మన్ సుఖ్ మాండవీయ’ 2025 సెప్టెంబర్ 18నతెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా సభ్యులు మెంబర్ పోర్టల్ (https://unifiedportal-mem.epfindia.gov.in/member-interface/) లో పొందుపరచిన ‘పాస్ బుక్ లైట్’ ద్వారా ఖాతా వివరాలను తెలుసుకోవచ్చును. ఇందుకోసం మెంబర్ పోర్టల్ లో లాగ్ ఇన్ అవ్వాలి.
ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారి పీఎఫ్ ను బదిలీ చేసుకున్న తర్వాత సభ్యుడు తీసుకునే ‘ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్’ ను ఇక నుంచి ఆన్లైన్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
(4) తిరుమల తిరుపతి దేవస్థానం
భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జిత సేవలు, సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (TTD) సూచించింది.



