విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) కి ‘ఓపీ’ (Out Patient) సేవల కోసం ప్రతి రోజూ సుమారు రెండు వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. కేజీహెచ్ లోని వివిధ ఓపీ సేవలకు సంబంధించిన రూమ్ నంబర్ల వివరాలు (Vizag KGH OP Room Numbers For Different Services) ఈక్రింది విధంగా ఉన్నాయి.
వివిధ ఓపీ సేవలు – రూమ్ నంబర్లు
సోమవారం నుండి శనివారం వరకు వైజాగ్ కేజీహెచ్ లో వివిధ రకాల ‘ఓపీ’ సేవలు అందుబాటులో ఉంటాయి.
- ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్ (OP, IP Registration) – (1)
- క్యాజువాల్టీ (Casualty) – (2)
- ఫార్మసీ (Pharmacy) – (3)
- క్యాజువాల్టీ ఫార్మసీ (Casualty Pharmacy) – (3A)
- డెంటల్ (Dental) – (4)
- ఫార్మసీ స్టోర్ (Pharmacy Store) – (5)
- అత్యవసర ఓపీ (Emergency OP) – (6)
- ఇంజెక్షన్ రూమ్ (Injection Room) – (7)
- న్యూరో, కార్డియాలజీ, సీటీ సర్జరీ (Neuro, Cardiology, CT Surgery) – (8)
- జనరల్ సర్జరీ (General Surgery) – (9)
- ఆర్థోపెడిక్స్ (Orthopedics) – (10)
- ఫిజియోథెరపీ (Physiotherapy) – (11)
- ఆయుర్వేదం (Ayurvedam) – (11A)
- యూరాలజీ (Urology) – (12)
- ఎక్స్ రే (Xray) – (13)
- పీడియాట్రిక్ సర్జరీ (Pediatric Surgery) – (14)
- జనరల్ మెడిసిన్ (General Medicine) – (15)
- గర్భిణుల ఓపీ (Pregnants OP) – (16)
- గైనకాలజీ (Gynecology) – (17)
- కుటుంబ నియంత్రణ (Family Planning) – (18)
- పీడియాట్రిక్స్ (Pediatrics) – (19)
- క్షయ నియంత్రణ (TB) – (20)
- వెల్ నెస్ సెంటర్ (Wellness Center) – (21)
- ఎస్ టీ డీ (STD) – (22)
- టీ ఆర్ ఐసీయూ (TRICU) – (23)
- గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ (Gastroenterology, Nephrology) – (24)
- డెర్మటాలజీ (Dermatology) – (25)
- క్లినికల్ లేబొరేటరీ (Clinical Laboratory) – (26)
- బ్లడ్ బ్యాంకు (Blood Bank) – (27)
- కార్డియాలజీ వార్డు (Cardiology Ward) – (28)
- రేడియాలజీ స్కానింగ్ (Radiology Scanning) – (29)
- ఆప్తమాలజీ (Ophthalmology) – (30)
- ఎండోక్రైనాలజీ (Endocrinology) – (31)
- ఏ ఆర్ టీ సెంటర్ (ART Center) – (32)
- డీఈఐ సీఓపీ (DEI COP) – (33)
- సైకియాట్రిక్ ఓపీ (Psychiatric OP) – (34)
- సీటీఎంఆర్ఐ (CTMRI) – (35)
- మెడికల్ ఆంకాలజీ (Medical Oncology) – (36)
- రేడియో థెరపీ (Radio Therapy) – (37)
- సర్జికల్ ఆంకాలజీ (Surgical Oncology) – (38)
- వాస్కులర్ సర్జరీ (Vascular Surgery) – (39)
- న్యూక్లియర్ మెడిసిన్ (Nuclear Medicine) – (40)
- ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) – (42)
- ప్రివెంటివ్ సర్జరీ (Preventive Surgery) – (222)
వైజాగ్ కేజీహెచ్ – పనివేళల వివరాలు
వైజాగ్ కేజీహెచ్ లోని వివిధ విభాగాల పనివేళల వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
సాధారణ ఓపీ
సాధారణ ఓపీ లకు ఆదివారం సెలవుగా పరిగణిస్తారు. అయితే ఇన్ పేషెంట్లకు కేస్ షీట్లు 24 గంటలూ జారీ చేస్తారు.
అత్యవసర విభాగం (క్యాజువాల్టీ)
అత్యవసర విభాగంలో ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు, క్లినికల్ లేబొరేటరీ, బ్లడ్ బ్యాంకు, కార్డియాలజీ వార్డు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మిగిలిన విభాగాలు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తాయి.
ఓపీ ఎక్స్ రే
ఓపీ ఎక్స్ రే (OP X-ray) విభాగం మాత్రం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవలు అందిస్తుంది.



